- పలు గ్రామాల్లో ఘనంగా అమరవీరుల సంస్కరణ దినోత్సవం.
- జెండాను ఆవిష్కరించిన కామ్రేడ్లు.
- పలువురు అమరవీరులకు నివాళులు.
(నమస్తే న్యూస్, నవంబర్ 03, మహబూబాబాద్)
అమరుల ఆశయాల సాధనకై పునరంకితమవుదామని సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ మండల వెంకన్న పిలుపునిచ్చారు.సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో నవంబర్ 1 నుంచి 9 వరకు జరుగుతున్న అమరవీరుల వర్ధంతి సభల వారోత్సవంలో భాగంగా, మహబూబాబాద్ మండలంలోని వి.ఎస్. లక్ష్మీపురం, రంగసాయిపేట, బోడగుట్ట తండాలలో అమరుల స్మారక స్థూపాల వద్ద జెండాలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కామ్రేడ్స్ గుజ్జు దేవేందర్, కాడబోయిన శ్రీశైలం పాల్గొన్నారు.స్మారక సభలో మాట్లాడుతూ కామ్రేడ్ మండల వెంకన్న "భూమి కోసం, భూక్తి కోసం, దేశ విముక్తి కోసం ప్రాణత్యాగం చేసిన వీరుల త్యాగాలను స్మరించుకోవాలి. వారి ఆశయ సాధనలో మనమూ పునరంకితమవ్వాలి," అని పిలుపునిచ్చారు. అనంతరం మాట్లాడుతూ "అర్థభూస్వామ్య వ్యవస్థను సమూలంగా పికిలించి, నూతన ప్రజాస్వామిక విప్లవం సాధించడమే లక్ష్యం కావాలనీ, గోదావరి పరివాహక ప్రాంతంలో 11 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచిపెట్టిన చరిత్ర విప్లవకారులదేనని ,ఆ త్యాగాలు ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలుస్తాయని అన్నారు.ఈ సందర్భంగా ఆయన చండ్ర పుల్లారెడ్డి, తరిమిల నాగిరెడ్డి, కొల్లా వెంకయ్య, చారు మజుందార్, మెరికల్ లాంటి కామ్రేడ్స్ పోరాటాలను స్మరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ లింగన్న, పివైఎల్ జిల్లా కార్యదర్శి బట్టు చైతన్య, మరియు గ్రామాల నాయకులు కొండ నరసయ్య, మట్టిపల్లి లింగయ్య, గుండమైన సత్యనారాయణ, సోమిరెడ్డి పులిగిల్ల బాలమల్లు, శ్రీను, లక్ష్మయ్య, వీరబాబు, అలాగే అరుణోదయ సంస్కృతిక సమైక్య నాయకులు కుకముడి యాకయ్య, కల్పన, మునిత, అనిత, పద్మ, సంధ్య, జ్యోతి, మౌనిక, యుగంధర్, మహేష్, భగవాన్ తదితరులు పాల్గొన్నారు.



