- నిరుపేద విద్యార్థులకు చేయుతనిద్దాం.
- 130 మంది పేద విద్యార్థులకు షూస్ పంపిణీ.
- ఆనందం వ్యక్తం చేస్తున్న మరిపెడ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు
(నమస్తే న్యూస్, నవంబర్ 03, మరిపెడ)
ప్రభుత్వ పాఠశాలలో చదివే నిరుపేద విద్యార్థులకు చేయూతను అందించడానికి ముందుకు రావాలని మరిపెడ సిఐ రాజకుమార్ గౌడ్ పిలుపునిచ్చారు.మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్ గౌడ్ మానవతా విలువలకు ఆదర్శంగా నిలిచారు. ఆయన తన సొంత వేతనంతో సీతారాంపురం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 130 మంది నిరుపేద విద్యార్థులకు షూస్ పంపిణీ చేశారు.పోలీసులంటే కఠినంగా, కర్కశంగా ఉంటారనే అభిప్రాయాన్ని తారుమారు చేస్తూ రాజ్ కుమార్ గౌడ్ మానవత్వం చూపారు. పిల్లలకు షూస్ అందజేసిన ఆయన వారి ముఖాల్లో ఆనందాన్ని చూసి సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా సీఐ రాజ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయడం నా వ్యక్తిగత ధ్యేయమని ,పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి ఇలాంటి సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా కొనసాగిస్తాననీ అన్నారు.సామాజిక బాధ్యతతో ముందడుగు వేసిన సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్ గౌడ్ సేవా మనసుకు స్థానిక ప్రజలు జేజే లు పలుకుతున్నారు.


