కాంగ్రెస్ తోనే సమగ్ర అభివృద్ధి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో కోరం కనకయ్య
(నమస్తే న్యూస్ బ్యూరో ,జూబ్లీహిల్స్, నవంబర్ 03)
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం వేగం పుంజుకుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయమే ప్రజా సంక్షేమానికి మార్గమని ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే శ కోరం కనకయ్య అన్నారు.రెహమత్ నగర్, బోరబండ డివిజన్‌ల పరిధిలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ సభ్యులతో సమావేశం నిర్వహించిన ఆయన వార్డులవారీగా అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు మార్గదర్శకత్వం ఇచ్చారు. ప్రజల సమస్యలను ఇంటింటికి చేరి వినాలని, పార్టీ అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "జన భావనలను అర్థం చేసుకుంటూ, కాంగ్రెస్ పార్టీ హామీలను నెరవేర్చే శక్తి ఒక్క కాంగ్రెస్‌కే ఉంది. సమగ్ర అభివృద్ధి, సామాజిక న్యాయం ఇవే మా లక్ష్యాలు" అని స్పష్టం చేశారు.సమావేశంలో ఇల్లందు మార్కెట్ కమిటీ చైర్మన్ బానోత్ రాంబాబు,కొండపల్లి సొసైటీ చైర్మన్ ధనియాకుల హనుమంతరావు,ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు తోటకూరి శివయ్య, పత్తె మధు తదితరులు పాల్గొన్నారు.





