నీటమునిగి కుళ్ళిన పంటలను పరిశీలించిన సిపిఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ తొర్రూరు డివిజన్ కార్యదర్శి ఊడుగుల లింగన్న.
(నమస్తే న్యూస్, నవంబర్ 08, మరిపెడ)
తుఫాను వల్ల తీవ్రంగా నష్టపోయిన పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని సిపిఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ తొర్రూరు డివిజన్ కార్యదర్శి ఊడుగుల లింగన్న డిమాండ్ చేశారు.మరిపెడ మండలం అబ్బాయిపాలెం బోడతండ గ్రామంలో ఇటీవల "మెంథా" తుఫాను వల్ల తీవ్రంగా నష్టపోయిన పంటలను సిపిఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా లింగన్న మాట్లాడుతూ, " అన్ని రకాల పంటలను ప్రభుత్వమే.కొనుగోలు చేయాలి. తేమ పేరుతో కటింగ్లు విధించి రైతులను ఇబ్బందులకు గురి చేయకూడదు" అని డిమాండ్ చేశారు.అదే సమయంలో, ప్రభుత్వం కి.జూబ్లీహిల్స్ ఉపఎన్నికలలో ఉన్న శ్రద్ధ రైతుల పక్షాన లేకుండా వ్యవసాయ అధికారులు తమ ఆఫీసులకే పరిమితమైపోతున్నారని తీవ్రంగా ఆక్షేపించారు. రైతుల సమస్యలకు పరిహారం కోసం వెంటనే చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వం రైతుల పంటలను కాపాడాలని, తడిసిన ధాన్యాన్ని పత్తి ,మొక్కజొన్న పంటలను ఎవో, ఎఈఓ అధికారులు క్షేత్రస్థాయిలో తిరిగి పంట నష్టాన్ని అంచనా వేసి పేద రైతులను కాపాడాలని లింగన్న స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో గుగులోత్ చంద్రు, గుగులోత్ గోంది,బానోత్ బోడి చంద్రయ్య,బోడ వాలి పాల్గొన్నారు.

