Type Here to Get Search Results !

పల్లెల్లో ఏరులై పారుతున్న మద్యం.... పోలీసులపైనే దాడి.

  • పల్లెల్లో ఏరులై పారుతున్న మద్యం... ఉలిక్కిపడిన చండూరు!
  • మందు మత్తులో విచక్షణ కోల్పోయిన తాగుబోతులు  పోలీసులపై దాడి.
  • జరిగే క్రైమ్ లో మేజర్ పాత్ర మద్యం మత్తులోనే.. 
  • ఆందోళనలో చండూరు ప్రజలు.  
  • పోలీసులపై దాడులు...సామాన్యుల సంగతేంటి..?   
  • బహిరంగంగా మద్యం సేవించడంపై మందలించిన పోలీసులు. 
  • రెచ్చిపోయి దాడి చేసిన మందుబాబులు.



(నమస్తే న్యూస్ డెస్క్, హైదరాబాద్, నవంబర్ 08)నల్గొండ జిల్లా చండూరులో మద్యం మత్తులో రెచ్చిపోయిన మందుబాబులు పోలీసులపై దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనపై స్థానిక ప్రజల్లో ఆందోళన నెలకొంది.వివరాల్లోకి వెళితే చండూరు పట్టణంలోని బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న ముగ్గురు యువకులను పోలీసులు హెచ్చరించినట్లు సమాచారం. అయితే, మద్యం మత్తులో విచక్షణ కోల్పోయిన వారు పోలీసులపై రెచ్చిపోయి దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులకు స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది.బాధిత పోలీసులు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.ప్రజలు ఈ సంఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులపైనే ఇలాంటి దాడులు జరుగుతున్నాయంటే  సామాన్యుల సంగతేంటి? అని ప్రశ్నిస్తున్నారు.

చండూరు పరిసరాల్లో మద్యం దందా, బహిరంగ మద్యం సేవలపై పోలీసులు కట్టడి చర్యలు ముమ్మరం చేశారు.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.