విద్యుత్ భద్రతపై అవగాహన
పెద్దనాగారం గ్రామంలో పొలంబాట కార్యక్రమం
(నమస్తే న్యూస్, నవంబర్ 08,నరసింహుల పేట)
రైతులు తమ పంట పొలాల వద్ద ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ లైన్లు, కరెంటు పొల్లు, తెగిపోయిన వైర్లు లేదా ట్రాన్స్ఫార్మర్ వద్ద ఫ్యూజులు పోయిన సందర్భాల్లో తక్షణమే సమీప విద్యుత్ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని ఏ.ఈ పాండు సూచించారు.
ఈ సందర్భంగా నర్సింహులపేట మండలం పెద్దనాగారం గ్రామంలో పొలంబాట కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో రైతులకు విద్యుత్ భద్రతపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఏఈ పాండు గారు మాట్లాడుతూ మీరు స్వయంగా మరమ్మత్తులు చేయడానికి ప్రయత్నిస్తే ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి విద్యుత్ సిబ్బంది సహకారాన్ని పొందండి" అని రైతులను కోరారు.ఈ కార్యక్రమంలో ఏ.ఈ పాండు, లైన్ ఇన్స్పెక్టర్ మల్సూర్, లైన్ మెన్ లింగయ్య, ఏ ఎల్ ఎం అశోక్ మరియు సిబ్బంది శ్రీను,రమేష్ పాల్గొన్నారు.

