- డెమోక్రటిక్ జర్నలిస్టుల ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడిగా మాలోత్ సురేష్.
- జర్నలిస్టుల హక్కుల కోసం కృషి చేస్తానని హామీ.
(నమస్తే న్యూస్, నవంబర్ 09 – మహబూబాబాద్)
డెమోక్రటిక్ జర్నలిస్టుల ఫెడరేషన్ (వర్కింగ్) మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడిగా గార్ల మండలం చిన్నకిష్టపురం గ్రామానికి చెందిన మాలోత్ సురేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.హనుమకొండలోని ఆదర్శ లా కళాశాల ప్రాంగణంలో జరిగిన ఉమ్మడి ఓరుగల్లు మహాసభలో జాతీయ అధ్యక్షుడు మానసాని కృష్ణారెడ్డి సమక్షంలో ఆయన ఎన్నిక జరిగిందని సురేష్ తెలిపారు.ఈ మహాసభకు ప్రత్యేక ఆహ్వానితులుగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరై ప్రసంగించారు.ఈ సందర్భంగా మాలోత్ సురేష్ మాట్లాడుతూ జర్నలిస్టుల హక్కుల సాధనకై కట్టుబడి పనిచేస్తాను. అక్రిడిటేషన్ ఉన్నా లేకపోయినా ప్రతి జర్నలిస్టుకు గృహ స్థలం కల్పించాలనే డిమాండ్‌ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.

