- సూర్యాపేట విద్యానగర్‌లో పిచ్చి కుక్కల స్వీరవిహారం.
- రోగులు, ద్విచక్ర వాహన దాడులపై దాడులు.
- పట్టించుకోని మున్సిపల్ అధికారులు.
- వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్.
(నమస్తే న్యూస్, నవంబర్ 09 – సూర్యాపేట)
సూర్యాపేట పట్టణంలోని విద్యానగర్ రోడ్డు, తెలంగాణ విగ్రహం ప్రాంతాల్లో పిచ్చి కుక్కల స్వీరవిహారం ప్రజల్లో భయాందోళన కలిగిస్తోంది. ఆసుపత్రులకు చికిత్స కోసం వచ్చే రోగులపై, బైక్‌దారులపై కుక్కలు దాడి చేస్తున్న ఘటనలు వరుసగా చోటుచేసుకుంటున్నాయి.ఈ సంఘటనలతో కాలనీవాసులు, ఆసుపత్రులకు వచ్చే ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. “ప్రజల ప్రాణ భద్రత కోసం వెంటనే చర్యలు తీసుకోవాలి” అని సూర్యాపేట మున్సిపల్ అధికారులను కోరారు.పట్టణంలో కుక్కల సంఖ్య పెరుగుతుండడంతో పిల్లలు, వృద్ధులు బయటకు వెళ్లడానికే భయపడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.వెంటనే కుక్కల నియంత్రణ దళాన్ని రంగంలోకి దింపి, పిచ్చి కుక్కలను పట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

