భారీగా పిడిఎస్ బియ్యం పట్టివేత.
(నమస్తే న్యూస్, దంతాలపల్లి,నవంబర్ 10)
పిడిఎఫ్ బియ్యాన్ని తరలిస్తున్న ఓ వాహనాన్ని దంతాలపల్లి పోలీసులు పట్టుకున్నారు.దంతాలపల్లి శివారు రాజస్థాన్ దాబా వద్ద దంతాలపల్లి పోలీస్ మరియు జిల్లా సివిల్ సప్లై అధికారులు సంయుక్తంగా చేస్తున్న తనిఖీల లో ఖమ్మం నుండి వరంగల్ వైపు వెళ్తున్న AP02TC2893 లారీ లో పీడీఎస్ రైస్ ను తరలిస్తున్నట్లుగా గుర్తించి, వాహనాన్ని స్వాధీనపరుచుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా ఎస్సై తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్ఐ రాజు మాట్లాడుతూ నిరుపేదలకు ప్రభుత్వం అందించే పిడిఎఫ్ బియ్యాన్ని తరలించినా,అక్రమ వ్యాపారాలు నిర్వహించినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

