నమస్తే న్యూస్ మహబూబాబాద్
వందేమాతరం" సామూహిక గీతాలాపన
శ్రీ బంకిమ్ చంద్ర ఛటర్జీ “వందే మాతరం” జాతీయ గీతాన్ని రచించి 150 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఆ గీతాన్ని సామూహిక గానం చేయడం జరిగింది,
కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు) లెనిన్ వత్సల్ టోప్పో, (రెవెన్యూ) కె.అనిల్ కుమార్, జిల్లా అధికారులు, అన్ని విభాగాల సిబ్బందితో కలిసి జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్, గీతాన్ని ఆలపించారు,
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి దక్షిణామూర్తి, హార్టికల్చర్ అధికారి మరియన్నా, బిసి, ఎస్సీ ,మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులు శ్రీనివాసరావు, శ్రీనివాస్, డీఎంసివిల్ సప్లై కృష్ణవేణి, మైన్స్ ఏడి వెంకటరమణ, టీఎన్జీవోస్ జేఏసీ చైర్మన్ వడ్డబోయిన శ్రీనివాస్, డిపిఆర్ఓ రాజేంద్రప్రసాద్, కలెక్టరేట్ పరిపాలన అధికారి పవన్ కుమార్, మెప్మా విజయ, విజయ కుమారి, మురళి, ఆర్.శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, కొప్పు ప్రసాద్, సక్కుబాయి, కిషోర్, అన్ని విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.

