ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య.
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కి సహకరించాలి.
పేద పిల్లల చదువుకు గ్రామస్థుల చేయూత కావాలి : ఎంఈఓ రామ్మోహన్ రావు
విద్యార్థులకు స్కూల్ బ్యాగులను పంపిణీ చేసిన నాగిరెడ్డి సునీల్ రెడ్డి.

(నమస్తే న్యూస్ నవంబర్ 14 నర్సింహులపేట)
ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడంలో సమాజం ప్రధాన పాత్ర పోషించాలని మండల విద్యాధికారి రామ్మోహన్ రావు పిలుపును ఇచ్చారు. ఎంపియుపిఎస్ పడమటిగూడెంలో బాలలదినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానోపాధ్యాయులు ఎర్ర పూర్ణచందర్ అధ్యక్షతన నిర్వహించిన తల్లిదండ్రుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు.పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు ముందుకు వస్తే ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ సంస్థలకు ఏమాత్రం తీసిపోవని ఆయన పేర్కొన్నారు. ఇంటి వద్ద పిల్లల చదువు, ప్రవర్తనపై తల్లిదండ్రులు శ్రద్ధ చూపాలని సూచించారు.ఈ కార్యక్రమంలో భాగంగా అదే పాఠశాలలో చదువుతున్న గ్రామస్థుడు నాగిరెడ్డి సునీల్ రెడ్డి ,కూతురు నిత్యా రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, స్వీట్స్ పంపిణీ చేయడం కార్యక్రమానికి విశేష ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానోపాధ్యాయులు సునీల్ రెడ్డి కి ధన్యవాదాలు తెలిపారు.పాఠశాల అభివృద్ధికి సహకరించిన జక్కుల మల్లయ్య, శ్రీశైలం, వెంకట్ రెడ్డిలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీనివాస్, మురళీధర్, నట్టే శేఖర్, తిరుపతయ్య, వెంకన్న, గ్రామస్తులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
![]() |

