![]() |
| సమావేశంలో మాట్లాడుతున్న సుమ |
(నమస్తే న్యూస్,నవంబర్ 14,మహబూబాబాద్)
మహిళలకు రక్షణ కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యురాలు దాసగాని సుమ విమర్శించారు. మహబూబాబాద్‌లో నిర్వహించిన ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా గర్ల్స్ కన్వెన్షన్‌కు ఆమె ముఖ్య అతిథిగా హజరయ్యారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, విద్యార్థినుల భద్రత, ఉన్నత విద్యలో మహిళలకు సమాన అవకాశాల కల్పనపై ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో వెంటనే విద్యాశాఖ మంత్రిని నియమించడం అత్యవసరమని ఆమె పేర్కొన్నారు.కన్వెన్షన్‌లో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు గందసిరి జ్యోతిబసు, నాయకులు పట్ల మధు మాట్లాడుతూ, మహిళలపై దాడులు, వేధింపులు పెరుగుతున్న తరుణంలో విద్యాసంస్థల్లో భద్రతా చర్యలను బలోపేతం చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్‌ఐ జిల్లా గర్ల్స్ నాయకులు మన్నూరి నిక్షిప్త, రెబెల్లి శృతి, రాజేశ్వరి, అలాగే రాకేష్, పవన్ తదితరులు పాల్గొన్నారు.
![]() |
| సమావేశంలో మాట్లాడుతున్న పట్ల మధు, జ్యోతి బసు. |


