Type Here to Get Search Results !

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రనాయక్


రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రనాయక్


  • ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది.



(నమస్తే న్యూస్, దంతాలపల్లి, నవంబర్ 14)

రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని, రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రనాయక్ తెలిపారు. మండలంలోని తూర్పు తండా గ్రామంలో పౌర సరఫరాల సంస్థ, తెలంగాణ ప్రభుత్వం, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ–సెర్చ్ (ఐకెపి) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంతోషిమాత ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు దళారుల చీటింగ్‌కు గురికాకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించి పూర్తి మద్దతు ధర పొందాలని సూచించారు. రైతుల కోసం ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని, ధాన్యం కొనుగోలు ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ‘‘రైతు ఇబ్బంది పడకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం నిల్వ, రవాణా, చెల్లింపుల విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది’’ అని అన్నారు.

ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సునీల్ రెడ్డి, ఎంపీడీవో విజయ, వ్యవసాయ శాఖ అధికారి వాహిని, ఎంపీఓ అప్సర్ పాషా, ఏఎంసీ వైస్ చైర్మన్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బట్టు నాయక్, నవీన్ రెడ్డి, సంపేట సురేష్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, సురేష్ యాదవ్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.






Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.