యువత శివాజీ ధైర్యసాహసాలను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలి
: ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్
చిట్యాల గ్రామంలో శివాజీ విగ్రహ స్థాపనకు రూ.1 లక్ష ఆర్థిక సహాయం.
(నమస్తే న్యూస్,మెదక్,నవంబర్ 17)
మెదక్ మండలం చిట్యాల గ్రామంలో శివాజీ మహారాజ్ విగ్రహ స్థాపనకు ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రూ.1 లక్ష ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలతో మాట్లాడిన ఆయన, శివాజీ మహారాజ్ ధైర్యసాహసాలు యువతకు శాశ్వత ప్రేరణ అని పేర్కొన్నారు.ఎంతటి పరిస్థితుల్లోనైనా ధర్మం, దేశం కోసం నిలబడిన శివాజీ మహారాజ్ ఆశయాలు ఇప్పటికీ సమాజానికి మార్గదర్శకాలని ఎమ్మెల్యే అన్నారు.“చరిత్రలో ఏ మహనీయునికి విగ్రహం ప్రతిష్టించినా, వారి ఆశయాలను ఆచరణలో పెట్టడం ముఖ్యమైంది. విగ్రహాల వద్ద పూలు పెట్టడం మాత్రమే కాకుండా, వారి జీవితం, విలువలు, కర్తవ్యాన్ని యువత తెలుసుకుని ముందుకు సాగాలి’’ అని రోహిత్ సూచించారు.శివాజీ మహారాజ్ గొప్పతనాన్ని సమాజానికి వివరించే కార్యక్రమాలు నిర్వహించాలనీ, అలా చేస్తేనే చైతన్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ పేర్కొన్నారు.

