Type Here to Get Search Results !

జూబ్లీహిల్స్ గెలుపుకు కాంగ్రెస్ నానా హంగామా చేసింది : మాజీ మంత్రి సత్యవతి రాథోడ్

జూబ్లీహిల్స్ గెలుపుకు కాంగ్రెస్ నానా హంగామా చేసింది : మాజీ మంత్రి సత్యవతి రాథోడ్


రైతు సమస్యలు పక్కన పెట్టిన ప్రభుత్వం.....డోర్నకల్‌లో మీడియా సమావేశం.



(నమస్తే న్యూస్, కురవి,నవంబర్ 17)

కురవి మండల కేంద్రంలో జరిగిన మీడియా సమావేశంలో మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో గెలవడానికి కాంగ్రెస్ నానావిధాల ఒత్తిళ్లు, ప్రలోభాలు ప్రయోగించిందని ఆమె ఆరోపించారు.ఈ సందర్భంగా సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ“రాష్ట్రంలో రైతు సమస్యలు అతలాకుతలం అవుతున్నా, ఈ ప్రభుత్వం గాలికే వదిలేసింది. పరిపాలన కన్నా రాజకీయ హంగామాలకే ప్రాధాన్యం ఇస్తోంది’’ అంటూ మండిపడ్డారు.

“జూబ్లీహిల్స్ గెలుపు కాంగ్రెస్‌కు చివరి గెలుపు”

జూబ్లీహిల్స్ ఎన్నికను కాంగ్రెస్ ప్రాణపణంగా తీసుకుందని,“రేవంత్ రెడ్డికి ఇది చావో రేవో అన్నట్టుగా ప్రచారం చేశారు. అధికార దుర్వినియోగం అతి స్థాయికి వెళ్లింది’’ అని విమర్శించారు.

కల్వకుంట్ల కవితపై తీవ్ర వ్యాఖ్యలు

కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ“బీఆర్‌ఎస్‌ను విమర్శించే హక్కు కవిత గారికి లేదు. ఆమె చేసిన హంగామాల వల్లే పార్టీకి ఇలాంటి పరిస్థితులు వచ్చాయి’’ అని సత్యవతి రాథోడ్ తీవ్రంగా దాడి చేశారు.“ఎన్నికల ముందు ఎవరు ఏం చేసారో రాష్ట్రమ్మంతా చూసింది’’ అని ఆమె వ్యాఖ్యానించారు.

ప్రభుత్వంపై వరుస ఆరోపణలు

కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఆరోపణలను గుర్తుచేస్తూ “కాలేశ్వరం పై కమిషన్, సీబీఐ విచారణ అంటారు… ఏమైంది?”“ఫోన్ టాపింగ్ అంటూ రాష్ట్రాన్ని గందరగోళానికి గురి చేశారు… ఫలితం ఏమిటి?” “ఈడీ, సీబీఐ వస్తున్నాయి అంటూ మాటలు చెప్పారు… అవన్నీ గాలిమాటలేనట్టయ్యాయి’’ అని అన్నారు.బీఆర్‌ఎస్ ప్రభుత్వం అభివృద్ధి చేసినదే గాని అవినీతి చేయలేదని సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు.తండాలకు ఇచ్చిన హామీలేమయ్యాయి?ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరిపెడ్ మండలంలోని సీతారాం నాయక్ తండాకు వెళ్లి ఇచ్చిన హామీలు అమలు కాలేదని ఆమె అన్నారు.“తండావాసులు ఆకేరు బ్రిడ్జి దగ్గర ధర్నా చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? కాంగ్రెస్ ప్రభుత్వం మాట నిలబెట్టుంటే ప్రజలు రోడ్ల మీదకు వచ్చారా?” అని ప్రశ్నించారు.

ప్రజా సమస్యలు పట్టించుకోని ప్రభుత్వానికి ప్రజలే గుణపాఠం చెప్తారు

గ్రామాల్లో పారిశుధ్యం దారుణంగా పడిపోయిందని, అభివృద్ధి ఆగిపోయిందని విమర్శించారు.ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు మరిచిపోయిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెప్తారని సత్యవతి రాథోడ్ అన్నారు.“గ్రామాలకు వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకోండి… పరిష్కారానికి కృషి చేయండి’’ అని ఆమె ప్రభుత్వానికి సూచించారు.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.