విలేకరీ పై తప్పుడు ఆరోపణలు..!పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు.
(నమస్తే న్యూస్, తొర్రూరు ,నవంబర్ 21 )
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో ముగ్గురు అన్నదమ్ముల మధ్య జరిగిన పంచాయతీ వ్యవహారంలో తాను ఎలాంటి జోక్యం చేసుకోలేదని, తనపై ₹5,000 అడిగాడనే తప్పుడు ఆరోపణలు పూర్తిగా అసత్యమని పేర్కొంటూ రిపోర్టర్ వి,మహేష్ అధికారికంగా ఫిర్యాదు చేసిన ఘటన చోటుచేసుకుంది. కొందరు వ్యక్తులు విలేకర్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ప్రజలలో అవమాన పరుస్తూ విలేఖరి పేరును దుర్వినియోగం చేస్తున్నాడని భావించి, సంబంధిత ఆధారాలతో తొర్రూరు పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించినట్లు మహేష్ తెలిపారు.విలేకర్లను లక్ష్యంగా చేసుకుని ఇలా తప్పుడు ఆరోపణలు చేయడం తీవ్రంగా తప్పు అని, నిజాలు బయటకు రావడానికి పోలీస్ వ్యవస్థ సరైన దర్యాప్తు చేయాలని మహేష్ డిమాండ్ చేశారు.పత్రికారంగం ప్రజల కోసం పనిచేసే రంగమని, విలేకర్లపై ఇలా అవాస్తవ ఆరోపణలు చేయడం పత్రికార అభ్యున్నతికి ముప్పు అని స్థానిక పాత్రికేయ సంఘాలు ఐక్యంగా స్పందిస్తున్నాయి.పోలీసులు ఈ ఫిర్యాదును నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం.

