చెక్ బౌన్స్ కేసులో ఒకరి అరెస్ట్!
రిమాండ్ విధించిన కోర్టు.
(నమస్తే న్యూస్, కేసముద్రం క్రైమ్, నవంబర్ 13)
చెక్ బౌన్స్ కేసులో వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన ఘటన కేసముద్రం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.2019 నుండి తప్పించుకుని తిరుగుతున్న తొర్రూర్‌కు చెందిన ఓ వ్యక్తిని కేసముద్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.కోర్టు వారంట్ మేరకు ఎస్సై క్రాంతి కిరణ్, నరేష్ సిబ్బందితో కలిసి నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లుగా తెలిపారు. కోర్టు విచారణ అనంతరం వ్యక్తిని రిమాండ్ విధించి జైలుకు తరలించారు.
కాగా ఎస్ఐ క్రాంతి కిరణ్ మాట్లాడుతూ చట్టం నుండి ఎవరు తప్పించుకోలేరని, చట్టాలను అతిక్రమించి పర్యావసనాలను అనుభవించడం కన్నా చట్టానికి లోబడి సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు.

