- దంతాలపల్లి మండలంలో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలు – ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలు.
- వాహనదారులు అప్రమత్తంగా ఉండాలి.
- రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి.
- దంతాలపల్లి ఎస్సై పిల్లల రాజు.
మహబూబాబాద్ జిల్లా, నవంబర్ 13 (నమస్తే న్యూస్):
మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండల కేంద్రంలో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుని ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఖమ్మం–వరంగల్ ప్రధాన రహదారిపై దంతాలపల్లి మండల కేంద్రంలోని సెయింట్ మేరీ హై స్కూల్ ఎదుట గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో గుమ్మడవెల్లి గ్రామానికి చెందిన తోట మహేష్ (28) తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. మరో ఘటనలో దంతాలపల్లి శివారులోని క్రషర్ సమీపంలో చర్లపాలెం గ్రామానికి చెందిన ధర్మారపు వెంకుమల్లు (45) బైక్‌పై వెళ్తుండగా, ట్రాక్టర్ ఢీకొనడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన క్షతగాత్రులను స్థానికులు వెంటనే తొర్రూరు ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు.
ఈ సందర్భంగా దంతాలపల్లి ఎస్సై పిల్లల రాజు మాట్లాడుతూ వాహనదారులు తమ ప్రయాణాలను నిర్ణీత సమయాల్లోగా పూర్తి చేసుకోవాలనీ ,వాహనాలను సాంకేతిక లోపాలు లేకుండా సరిచూడాలి. డ్రైవింగ్ సమయంలో తప్పనిసరిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించి అప్రమత్తంగా ఉండాలి. రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.రోడ్డుప్రమాదాలపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

