మణిముఖుర్ జ్యువెలర్స్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న సినీ యాంకర్
నమస్తే న్యూస్ బ్యూరో, సూర్యాపేట, నవంబర్ 3:
సూర్యాపేట నగరంలో జబర్దస్త్ షో, ‘పుష్ప’ మూవీ ఫేమ్ అనసూయ సందడి చేసింది. నగరంలోని ప్రముఖ ఆభరణాల దుకాణం ‘మణిముఖుర్ జ్యువెలర్స్’ ను ఆమె ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమెను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి, ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు.అనసూయ షోరూమ్‌లోని విలువైన నగలను పరిశీలించి,అనంతరం మీడియాతో మాట్లాడారు. "వినియోగదారుల నమ్మకమే ప్రతి వ్యాపారానికి బలం. నాణ్యమైన ఆభరణాలు అందించి ప్రజల మనసులు గెలుచుకోవాలని ఆకాంక్షిస్తున్నాను" అని ఆమె తెలిపారసూర్యాపేటలో రాష్ట్ర రాజధానిని తలదన్నే స్థాయిలో కార్పొరేట్ తరహా జ్యువెలరీ షాప్‌ను ఏర్పాటు చేసిన తెడ్ల కిషోర్, ఉమా మహేశ్వరి, వారి కుమారుడు సాయి కిరణ్, చాందినీలను అనసూయ అభినందించారు.గత 13 సంవత్సరాలుగా సాయి సంతోషి జ్యువెలర్స్ ద్వారా వినియోగదారుల విశ్వాసాన్ని సంపాదించిన ఈ కుటుంబం, నూతనంగా ప్రారంభించిన మణిముఖుర్ జ్యువెలర్స్‌తో తమ వ్యాపార పరంపరను మరింత విస్తరించాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.సూర్యాపేట ప్రజలు అనసూయ రాకతో ఉత్సాహంగా మునిగిపోయారు.

