నమస్తే న్యూస్ నర్సింహులపేట
కల్లు గీత కార్మిక సంఘం జిల్లా మహాసభల కరపత్రాల ఆవిష్కరణ
గీత వృత్తిలో ఉపాధి కల్పించి ప్రమాద నివారణకు చర్యలు తీసుకోండి. కే జీ కే ఎస్
లక్షలాదిమంది ఆధారపడి జీవిస్తున్న కల్లుగీత వృత్తిలో ఉపాధి అవకాశాలు మెరుగుపరిచి వృత్తిలో ప్రమాదాలు నివారించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కల్లుగీత కార్మిక సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు డోనీకేని రామన్న గౌడ్ చిర్ర సతీష్ గౌడ్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పడమటి గూడెం గ్రామంలోని శ్రీ కంఠమహేశ్వర స్వామి సన్నిధానంలో పడమటి గూడెం దేవ గౌడ సంఘం ఆధ్వర్యంలో కల్లుగీత కార్మిక సంఘం మూడవ జిల్లా మహాసభల కరపత్రాలు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ మానుకోట జిల్లా కేంద్రంలో జరిగే మహాసభలకు పెద్ద ఎత్తున తరలివచ్చి మన హక్కుల కోసం కొట్లాడాలని, రాష్ట్రంలో ఐదు లక్షల కుటుంబాలు కల్లు గీత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాయన్నారు. వీరిని ప్రోత్సహించి ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉందన్నారు. బడా పెట్టుబడిదారు లు తయారు చేస్తున్న లిక్కరు,థమ్సప్ , కోకో కోలా లాంటి శీతల పానీయాల వల్ల కల్లు అమ్మకాలు పడిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఈ పానీయాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఖజానా నింపుకోవడానికి ప్రోత్సహిస్తున్నాయని అన్నారు. ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ప్రకృతి పానీయాన్ని అందిస్తున్న లక్షలాదిమంది గీత కార్మికుల జీవనోపాధిని దెబ్బతీస్తున్నాయన్నారు. కొంతమంది వ్యాపారులు కల్లు కల్తీ చేస్తున్నారనే నెపంతో కల్లు పైనే దుష్ప్రచారం చేస్తున్నారని దీనిని మానుకోవాలని అన్నారు. ప్రభుత్వం కల్తీ జరగకుండా చర్యలు తీసుకోవాలి కానీ దాని పేరుతో వృత్తినే దెబ్బతీసే చర్యలు చేపట్టడం సబబు కాదన్నారు.
వృత్తిలో ప్రమాదానికి గురైన 710 మందికి ఇవ్వాల్సిన ఎక్సిగ్రేషియా 12 కోట్ల 96 లక్షలు ఎందుకు ఇవ్వడం లేదన్నారు. బాధితులంతా నిరాహార దీక్షలకు పూనుకున్నా ప్రభుత్వానికి పట్టదా అని ఆవేదన వ్యక్తం చేశారు. వృత్తి చేసే వారందరికీ వెంటనే కాటమయ్య రక్షణ కవచం ఇవ్వాలని, పెండింగ్ ఎక్సిగ్రేషియా డబ్బులు వెంటనే విడుదల చేయాలనీ నీరా మరియు తాటి ఈత ఉత్పత్తుల కేంద్రం ప్రారంభించాలని, నీరా కేఫ్ ని టెండర్ వేసి దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని కల్లుగీత కార్మికుల సంక్షేమానికి ఖర్చు చేయాలన్నారు. పెద్ద గౌడ్ చిర్ర మల్లయ్య చిన్న గౌడ్ జక్కి మురళి గౌడ నాయకులు శివ కృష్ణమూర్తి అబ్బ సాయిలు యాకన్న హనుమంతు యాకసైయలు ఉపేందర్ రవి ఉప్పలయ్య మల్లయ్య వెంకన్న మైపాల్ యుగంధర్ బ్రహ్మయ్య లింగయ్య శ్యామ్ మధు నాగన్న రవి మహేందర్ యాదగిరి సుధాకర్ కరుణాకర్ నరేష్ రమేష్ సాయిలు రాజు రాములు నర్సయ్య తదితరులు పాల్గొన్నారు....

