నమస్తే న్యూస్ మహబూబాబాద్
ఏ స్థాయి వైద్యులు అయినా హాస్పిటల్ లో వినియోగిస్తే చర్యలు
మార్చారీ ఘటనపై ఇద్దరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులపై వేటు....
జిల్లా జనరల్ ఆసుపత్రి వైద్యులతో రివ్యూ మీటింగ్
రోగుల పట్ల అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు
ఎమ్మెల్యే డా"భూక్యా మురళి నాయక్
మహబూబాబాద్ పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో మార్చురి ఘటనపై ఎమ్మెల్యే డా"భూక్యా మురళి నాయక్ గత రెండు రోజుల నుండి సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు.శనివారం మహబూబాబాద్ జనరల్ హాస్పిటల్ లో వైద్య సిబ్బందితో ఎమ్మెల్యే మురళి నాయక్ రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మేల్యే మాట్లాడుతూ సూపర్నెంట్ సమయపాలన పాటించడం లేదని వైద్య సిబ్బంది కూడా సమయపాలన కొరవాడిందని హెచ్చరించారు..
హాస్పిటల్ లో నర్సులు సాహితం కాలక్షేపణ చేస్తూ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులతో పనిచేఇస్తున్నారని కొంత మంది ఎమ్మెల్యే దృష్టికి తీసుకు వచ్చారని ఎమ్మెల్యే చాలా సీరియస్ గా స్పందించారు.
ఈ రోజు నుండి ఒక్క ఉద్యోగి కూడా డ్యూటీ లో ఉన్నపుడు సెల్ ఫోన్ ఉపయోగించరదని అన్నారు.అత్యవసరం అయితే ఆన్రైడ్ ఫోన్లకు బదులు నార్మల్ ఫోన్స్ ఉపయోగించాలని అన్నారు.రేవంత సర్కార్ ఏర్పడ్డ తర్వాత వైద్య ఆరోగ్య శాఖపై ప్రత్యేక దృష్టి పెట్టి మెరుగైన సేవలు అందిస్తుంటే మరో వైపు ఇలా వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వహించడం చాలా బాధకరం అని అన్నారు.
కొన్ని రోజులలో జిల్లా ఆసుపత్రి లో మార్పు రావాలని ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగి పట్ల మర్యాదగా వ్యవహరించాలని ఎమ్మెల్యే మురళి నాయక్ హెచ్చరించారు.
బతికున్న మనిషిని మార్చురీకి తరలించిన ఘటనలో విధుల్లో నిర్లక్షం వహించిన ఇద్దరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులపై చర్యలకు ఆదేశించారు..ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం అయితే హాస్పిటల్ సూపర్డెంట్, ఆర్ ఎం ఓ, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ పై చర్యలు ఉంటాయని ఎమ్మెల్యే హెచ్చరించారు....

