నమస్తే న్యూస్ మహబూబాబాద్
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకొని పోలీసుల ఆధ్వర్యంలో ఐక్యత 2 కె రన్ ను జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ తో కలసి జిల్లా ఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.... ఐక్యత రన్ లో విద్యార్థులు... యువత అధిక సంఖ్యలో పాల్గొని ఐక్యతను చాటివిజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరిని అభినందించారు. ప్రతి ఒక్కరి ఐక్యతగా ఉండి దేశ భద్రతకు పాటు పడాలన్నారు.అనంతరం దేశం యొక్క ఐక్యత... సమగ్రత... భద్రతను కాపాడడానికి నన్ను నేను అంకితం చేసుకుంటాను అని అందరి చేత ప్రతిజ్ఞ చేయించారు.
ఈ రన్ లో జిల్లా అడిషనల్ కలెక్టర్ నవీన్ వత్సల్ టోప్పో, పోలీస్ సిబ్బంది,వివిధ పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు, యువత పాల్గొన్నారు.


