నేలమట్టమైన వరి పంట
లబోదిబో మంటున్న రైతు
(నమస్తే న్యూస్, దంతాలపల్లి, అక్టోబర్ 30)
మొంథా తుఫాన్ ప్రభావంతో బుధవారం మండలంలో కురిసిన అకాల వర్షం రైతులపై విరుచుకుపడింది. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కారణంగా కోత దశలో ఉన్న వరి పొలాలు నేలమట్టమయ్యాయి.మండలంలోని రేపోని గ్రామానికి చెందిన రైతు సాదు రాం రెడ్డి తనకు ఉన్న 13 ఎకరాలలో వరి పంట సాగు చేశాడు. ఇందుకోసం సుమారు రూ.3 లక్షలు పెట్టుబడిగా వెచ్చించి పంటను పండించాడు. ఎకరానికి బస్తా యూరియా వేసి, ఎన్నో కష్టాలు పడి పంటను కోత దశకు తీసుకువచ్చాడు. అయితే అకాల వర్షం కారణంగా వరదనీరు పొలంలోకి చేరి పంట మొత్తాన్ని నేలకొరిగేలా చేసింది.చేతికొచ్చిన పంట కళ్ళముందే నాశనమవడంతో రైతు రాం రెడ్డి తీవ్రంగా వేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం తక్షణ సాయం అందించి, నష్టపరిహారం చెల్లించాలంటూ బాధిత రైతు కోరాడు.

