ఆకేరు వరద ప్రవాహం పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే రెడ్యా నాయక్
(నమస్తే న్యూస్, అక్టోబర్ 30, చిన్నగూడూరు)
ఆకేరు వాగు పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రైతులు అతస్థైర్యం కోల్పోవద్ధని డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డి.ఎస్ రెడ్యా నాయక్ అన్నారు.చిన్నగూడూరు మండలంలోని ఉగంపల్లి–చిన్నగూడూరు గ్రామాల మధ్య ప్రవహిస్తున్న ఆకేరు నదిపై నిర్మించిన వంతెనపైకి చేరి, వరద ప్రవాహాన్ని మాజీ ఎమ్మెల్యే డి.ఎస్. రెడ్యా నాయక్ గురువారం పరిశీలించారు.ఇటీవలి భారీ వర్షాలతో ఆకేరు నది ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. వంతెన నిర్మాణ స్థితిగతులను, నీటి మట్టం పెరుగుదలను ఆయన పరిశీలించారు. అవసరమైతే అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.రెడ్యా నాయక్ మాట్లాడుతూ, “ప్రజల భద్రత మా ప్రాధాన్యం. ఆకేరు వరదలు తరచుగా సమస్యగా మారుతున్నందున శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం,” అని తెలిపారు.ఈ సందర్బంగా స్థానిక ప్రజలు మాజీ ఎమ్మెల్యేను కలుసుకుని తమ సమస్యలను వివరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, గ్రామ సర్పంచులు, మండల నాయకులు పాల్గొన్నారు.



