- మొంథా తుఫాన్ ప్రభావం పరిశీలన.
- దంతాలపల్లి మండలంలో పంట నష్టాన్ని పరిశీలించిన అధికారులు.
(నమస్తే న్యూస్,దంతాలపల్లి, అక్టోబర్ 30)
మొంథా తుఫాన్ ప్రభావంతో మండలంలోని నిదానపురం, కుమ్మరి కుంట్ల, గున్నేపల్లి, రేపోని, లక్ష్మీపురం, రామవరం మరియు దాట్ల శివారు ప్రాంతాల్లో కురిసిన వర్షాల కారణంగా వరి, పత్తి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మండల వ్యవసాయ శాఖ అధికారులు ఈ పంట నష్టాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి గారు మాట్లాడుతూ — “మండల వ్యాప్తంగా వరి, పత్తి సహా ఇతర పంటలపై తుఫాన్ వలన జరిగిన నష్టాన్ని ప్రాథమికంగా అంచనా వేయడం జరిగింది. పూర్తి నివేదికను త్వరలోనే ఉన్నతాధికారులకు సమర్పిస్తాం” అని తెలిపారు.ఈ పర్యటనలో వ్యవసాయ విస్తరణ అధికారులు దీక్షిత్ కుమార్, ఉదయ్ కిరణ్ పాల్గొన్నారు.





