నమస్తే న్యూస్ తొర్రూరు
తొర్రూరులో మెడికల్ షాప్ పై పోలీసుల దాడి
డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే మత్తు టాబ్లెట్స్ విక్రయం
తొర్రూరులోని మెడికల్ షాప్ యజమాని అరెస్ట్
వెల్లడించిన నార్కోటిక్స్, నల్లగొండ పోలీసులు
మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తు టాబ్లెట్స్ విక్రయిస్తున్న మెడికల్ షాప్పై యాంటీనార్కోటిక్స్ బ్యూరో, నల్లగొండ పోలీసులు దాడి చేసి కేసు నమోదు చేశారు ఈ ఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకోగా, మంగళవారం
నల్లగొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యాంటీ నార్కోటిక్ బ్యూరో, నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి వివరాలు వెల్లడించారు.
నల్లగొండలోని మునుగోడ్ రోడ్లో యాంటీ నార్కోటిక్స్ బ్యూరో, నల్లగొండ 1 టౌన్ పోలీసులు సంయుక్తంగా ఆదివారం మధ్యాహ్నం తనిఖీలు చేపట్టగా నల్లగొండకు చెందిన మహమ్మద్ జబీఉల్లా అనే వ్యక్తి వీరిని చూసి మోటర్ సైకిల్పై పారిపోతుండగా వెంబడించి పట్టుకున్నారు.
అతడినితనిఖీ చేయగా మత్తు కలిగించే స్పాస్మో ప్రాక్సీవాన్ ప్రెస్ టాబ్లెట్స్ లభించాయి
అతడిని విచారించగా తొర్రూరులోని వెంకటరమణ మెడికల్ షాప్ నుంచి కొనుగోలు చేసినట్లు తెలిపాడు
దీంతో తొర్రూరు చేరుకున్న నార్కోటిక్స్ బ్యూరో నల్లగొండ పోలీసులు వెంకటరమణ మెడికల్ షాప్ పై దాడిచేసి మత్తు మందు కలిగించే స్పాస్మో ప్రాక్సీవాన్ ప్రెస్, ట్రామడాల్ టాబ్లెట్స్ ను గుర్తించారు
ప్రిస్క్రిప్షన్ లేకుండానే విక్రయిస్తున్నట్లు గుర్తించి యజమాని దారం కృష్ణ సాయిని అరెస్టు చేశారు
మెత్తం 1296 స్పాస్మో ప్రాక్సీవాన్ ప్రెస్ టాబ్లెట్స్, 345 ట్రామడాల్ టాబ్లెట్స్ ఒక ఫోన్ స్వాధీనం చేసుకుని షాప్ ను సీజ్ చేశారు
కృష్ణసాయి తన తండ్రి పేరిట షాప్ ను నడుపుతూ అధిక లాభాలు వచ్చెందుకు మత్తు టాబ్లెట్స్ విక్రయిస్తున్నట్లు విచారణలో తేలిందని డీఎస్సీ తెలిపారు

