Type Here to Get Search Results !

జిల్లా ఉపాధి శాఖ ఆధ్వర్యంలో జాబ్ మేళా

 నమస్తే న్యూస్ 


జిల్లా ఉపాధి శాఖ ఆధ్వర్యంలో జాబ్ మేళా

జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో *మరీనా పెయింట్ ప్రైవేటు లిమిటెడ్, కరీంనగర్, కంపెనీలో ఖాళీగా ఉన్న అడ్మిన్ మేనేజర్, అకౌంట్స్, టెలికాలర్, స్టోర్ ఇంచార్జ్, హెచ్.ఆర్.టీమ్, డేటా ఎంట్రీ, లీగల్ టీమ్, ఆఫీస్ సబార్డినెట్* తదితర   పోస్టులకు  అర్హత కల్గిన 18-35 వయసు గల స్త్రీ,పురుష అభ్యర్థులకు ఉద్యోగవకాశాలను కల్పించుటకు తేది: 25.10.2025 న జిల్లా ఉపాధి కార్యాలయంలో *జాబ్ మేళ* నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి టి. రజిత నేడు ఒక ప్రకటనలో తెలిపారు.

అర్హత, ఆసక్తి కల్గిన అభ్యర్ధులు తేది: 25.10.2025 న ఉదయం 10.30 గం. ల నుండి మధ్యాన్నం 2.00 గం.ల వరకు జిల్లా కలెక్టరేట్ లోని  ఎంప్లాయ్మెంట్ కార్యాలయంలో జరుగు జాబ్ మేళాకు తమ విద్యార్హతల సర్టిఫికెట్లు, రెజ్యూమ్ తో హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని జిల్లా ఉపాధి అధికారి కోరారు.

మరిన్ని వివరాలకు జిల్లా ఎంప్లాయ్ మెంట్ కార్యాలయంలో సంప్రదించి వివరాలు పొందవచ్చునని అన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.