రక్త దానం చేయండి..... ప్రజల ప్రాణాలను కాపాడండి.ఎస్సై కూచిపూడి జగదీష్
(నమస్తే న్యూస్,అక్టోబర్ 26,తిరుమలాయపాలెం)
పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా ఈ నెల 31న నేలకొండపల్లి మండల కేంద్రం లో తిరుమలాయపాలెం పోలీస్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని తిరుమలాయపాలెం ఎస్సై కూచిపూడి జగదీష్ పిలుపునిచ్చారు. రోడ్డు ప్రమాద బాధితులు, తలసేమియా, సికిల్ సెల్, డెంగ్యూ వంటి వ్యాధులతో బాధపడుతున్న రోగులకు రక్తం అత్యవసరమవుతుందని ఆయన పేర్కొన్నారు.బ్లడ్ బ్యాంకుల్లో రక్త నిల్వలు తక్కువగా ఉండడం వల్ల అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారు. అలాంటి బాధితులకు మన రక్తదానం ప్రాణదానం అవుతుందని ఎస్సై కూచిపూడి జగదీష్ అన్నారు.ఈ కార్యక్రమంలో తిరుమలాయపాలెం మండల ప్రజలు, యువతీ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని, రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని ఆయన కోరారు.

