బి అండ్ జి హ్యూమన్ రైట్స్ సంఘం సౌత్ ఇండియా జనరల్ సెక్రటరీ గా
మద్దిరాల వీరస్వామి
(నమస్తే న్యూస్,అక్టోబర్ 27 దంతాలపల్లి ): బి అండ్ జి హ్యూమన్ రైట్స్ సంఘం సౌత్ ఇండియా జనరల్ సెక్రటరీ గా మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం కుమ్మరికుంట్ల గ్రామానికి చెందిన మద్దిరాల వీరస్వామిని నియమించినట్లు సోమవారం తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బి అండ్ జి మానవ హక్కులు మరియు అవినీతి నిరోధక సంఘం ఆధ్వర్యంలో ఒంగోలులో జరిగిన సమావేశంలో జాతీయ అధ్యక్షులు భయపనేని వెంకటేశ్వర్లు,జాతీయ వైస్ చైర్మన్ రావులపల్లి తిరుపతయ్య,జాతీయ ప్రధాన కార్యదర్శి పొదిలి పవన్‌కుమార్ లు తనపై నమ్మకంతో సౌత్ ఇండియా జనరల్ సెక్రెటరీగా నియమించినట్లు తెలిపారు. పేదల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని అవినీతి, అక్రమాలకు తావులేని సమాజం కోసం సంస్థ చేస్తున్న కార్యక్రమాలలో విద్యావంతులు మేధావులు భాగస్వాములు కావాలని కోరారు. భారత రాజ్యాంగ చట్టాలకు అనుగుణంగా రాజీలేని పోరాటాలు చేస్తూ పేదల కష్టాలను, సమస్యలను తీర్చుటకు పని చేస్తామని,మంచిని పెంచి మానవత్వాన్ని పంచే కార్యక్రమాలను చేపడతామన్నారు.తన నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు,ధన్యవాదాలు తెలుపుతున్నట్లు,సౌత్ ఇండియా జనరల్ సెక్రెటరీగా నియామకం బాధ్యతలను పెంచిందని, సంఘం చేపట్టే ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ పేదల హక్కుల పరిరక్షణకై పనిచేస్తానని అన్నారు.


