నమస్తే న్యూస్
పారదర్శకంగా మద్యం దుకాణాల టెండర్ లక్కీ డ్రా
మహబూబాబాద్ జిల్లా కేంద్రం లోని ఏబీ ఫంక్షన్ హల్ లో జిల్లా ఎక్స్ సైజ్ శాఖ పరిధి లో గల 61 మధ్యం దుకాణాలకు జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ లక్కీ డీప్ ద్వారా లైసెన్స్ దారుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించారు.
2025...2027...సంవత్సరానికి గాను 61 మద్యం షాప్ లకు 1800 ల దరఖాస్తులు వచ్చాయి.
54 కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది.
ఒక్కో మద్యం దుకాణానికి వచ్చిన దరఖాస్తుల టోకెన్లను ఒక డబ్బా లో వేసి లక్కీ డీప్ ద్వారా ఒకరిని ఎంపిక చేశారు. డ్రా తీసిన సమయంలో అ దుకాణానికి దరఖాస్తు చేసుకున్న ఆశవాహులను మాత్రమే లోనికి అనుమతించారు.
డ్రా ద్వారా కైవసం చేసుకున్న మద్యం దుకాణదారుడు 1/6 వంతు చెల్లించి చలాన్ ను తప్పనిసరిగా అప్పగించాలి.
బ్యాంకు లో లైసెన్స్ ఫీజు చెల్లించిన చలాన్స్ ఎక్సైజ్ కార్యాలయం లో అందజేస్తే ఈ నెల 31న మద్యం దుకాణాల లైసెన్సులు అందజేస్తారు.
నూతన లైసెన్స్ దారులు డిసెంబర్ 1 నుంచి విక్రయాలు ప్రారంబిoచుకో వచ్చు.
హాల్ లో జరిగే డ్రా విధానం అనౌన్స్మెంట్ అందరికి వినిపించే విధంగా సౌండ్ బాక్స లను ఏర్పాటు చేశారు.
మరో వైపు లక్కీ డ్రా లో మద్యం దుకాణాలు రానివారు అనారోగ్యం పాలైతే చికిత్స అందించేందుకు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
ఫంక్షన్ హాల్ వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ను ఏర్పాటు చేశారు

