నమస్తే న్యూస్ మహబూబాబాద్
వానాకాలం వరి పంట కోత దశకు వచ్చినప్పటికీ మహబూబాబాద్ జిల్లాలో రైతుల యూరియా కష్టాలు ఇప్పటికీ తీరడం లేదు.
మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని శనిగపురం గ్రామంలో యూరియా కోసం రైతులు ఉదయం నాలుగు గంటల నుండే ప్రాథమిక వ్యవసాయ కేంద్రం వద్ద భారీగా క్యూలైన్లో నిలిచారు
వరి పంట వానకాలం నాటిన నుండి కోత దశకు వచ్చిన యూరియా కష్టాలు మాత్రం పోవడం లేదు రైతులు గత నాలుగు నెలల నుండి యూరియా కోసం కుటుంబంలో ఒక వ్యక్తిని కేటాయించామని ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంత దుర్భరమైన పరిస్థితులు ఉన్నాయని రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు కనీసం వచ్చే యాసంగి పంటల కోసమైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యూరియాను అందుబాటులో ఉంచాలని ప్రజలు రైతులు కోరుతున్నారు


