- అంగన్వాడి కేంద్రాలలో పిల్లల హాజరు శాతం పెంచాలి.
- సామ్, మామ్ పిల్లలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
- అంగన్వాడి కేంద్రాలలో ఎడ్యుకేషన్, హెల్త్ న్యూట్రిషన్, సానిటేషన్ తదితర అంశాలపై ప్రణాళిక ప్రకారం ముందుకు సాగాలి.
- జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్.
(నమస్తే న్యూస్, అక్టోబర్ 24, మహబూబాబాద్)
అంగన్వాడి కేంద్రాలలో పిల్లల హాజరు శాతం పెంచాలనీ,సామ్, మామ్ పిల్లలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని,అంగన్వాడి కేంద్రాలలో ఎడ్యుకేషన్, హెల్త్ న్యూట్రిషన్, సానిటేషన్ తదితర అంశాలపై ప్రణాళిక ప్రకారం ముందుకు సాగాలనీ
జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్.అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) లెనిన్ వత్సల్ టోప్పో, జిల్లా వెల్ఫేర్ అధికారిని సబిత,లతో కలిసి జిల్లా లోని స్త్రీ శిశు సంక్షేమ శాఖ శాఖ అంగన్వాడి సిడిపిఓలు, సూపర్ వైజర్స్ , టీచర్లతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు,ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో (1435) అంగన్వాడి కేంద్రాలలో ఎడ్యుకేషన్, న్యూట్రిషన్, హెల్త్, శానిటేషన్ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, అంగన్వాడి కేంద్రాలలో పిల్లలు, సిబ్బంది హాజరు శాతం పక్కాగా గమనించాలని సూచించారు,జిల్లాలో సామ్ (188), మామ్ (840) లపై దృష్టి పెట్టాలని, అంగన్వాడి కేంద్రాలలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ పౌష్టిక ఆహారం అందించాలని, ఉదయం 9, 10, 11, గంటలకు షెడ్యూల్ ప్రకారం ఆన్లైన్ ద్వారా హాజరు వివరాలను పరిశీలించాలని ఆదేశించారు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పోషణ పథకాలపై రూపొందించే కార్యక్రమాలను పక్కాగా నిర్వహించాలని సూచించారు.కేంద్రాల ద్వారా అందించే పౌష్టిక ఆహారం కోడిగుడ్లు, బాలామృతం, రైస్, తదితర ఆహార పదార్థాలను పిల్లలు , గర్భిణీలు, బాలింతలకు క్రమం తప్పకుండా అందించాలని సూచించారు.పిల్లలకు బేసిక్ లెర్నింగ్ ఎడ్యుకేషన్ను పూర్తిస్థాయిలో అందించాలని అందుకు టీచర్లు ప్రత్యేకంగా దృష్టి సారించాలని అన్నారు, స్టడీ మెటీరియల్ పిల్లలకు పంపిణీ చేస్తూ ప్రాక్టికల్స్ విధానం ద్వారా వారి మేదస్సును వెలికితీయాలన్నారు.జిల్లా ఆరోగ్యశాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ సమన్వయంతో కలిసి పిల్లల యొక్క ఆరోగ్య పరిస్థితులను షెడ్యూల్ ప్రకారం గమనిస్తూ ఉండాలని ఆయన ఆదేశించారు. హెల్త్ ఎడ్యుకేషన్ న్యూట్రిషన్ అందించే విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకుంటానని ఆయన సూచించారు.అంగన్వాడి సిడిపివోలు, సూపర్వైజర్లు క్షేత్రస్థాయిలో పక్కాగా ప్రతి కేంద్రాలను తనిఖీ చేసి రిజిస్టర్
లను పరిశీలించి ఏమైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తేవాలని సూచించారు.ఈ సమావేశంలో జిల్లా వెల్ఫేర్ అధికారిని సబిత, శిరీష, ఎల్లమ్మ, నీలోఫర్, కమల, లక్ష్మి, డాక్టర్ ప్రత్యూష, ఆస్పిరేషనల్ బ్లాక్ అధికారి శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.


