- ప్రభుత్వ పాఠశాలలు అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేసిన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో.
(నమస్తే న్యూస్ ,మహబూబాబాద్, అక్టోబర్ 24)
ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలని, ఆ దిశగా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో అన్నారు.శుక్రవారం అదనపు కలెక్టర్ మహబూబాబాద్ మండలం శనిగపురం గ్రామంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, మండల ప్రజాపరిషత్ పాఠశాలను, అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ విద్యార్థుల హాజరు శాతం, ఉపాధ్యాయుల హాజరుకు సంబంధించిన రిజిస్టర్లను, స్టోర్ రూం తనిఖీ చేశారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు చదివింది అర్థం చేసుకునేలా వారి యొక్క గ్రహణ శక్తి మెరుగయ్యేలా చూడాలని అన్నారు.విద్యార్థులను పాఠ్యాంశాలలోని పలు అంశాలపై ప్రశ్నలు అడిగి వారి యొక్క అభ్యసన సామర్త్యాలు పరిశీలించారు. విద్యార్థులకు మధ్యాహ్నం నాణ్యమైన భోజనం అందజేయాలని తెలిపారు.పాఠశాల ఉపాధ్యాయులు సకాలంలో హాజరు కావాలని, పాఠశాల ప్రాంగణం పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. అంగన్వాడి కేంద్రాన్ని తనిఖీ చేసి అందులోని పిల్లల హాజరు ను పరిశీలించారు. అంగన్ వాడి కేంద్రాలలో ఉన్న పిల్లల ఎదుగుదలను రెగ్యులర్ గా మానిటర్ చేయాలని, ఎత్తు తక్కువ, బరువు తక్కువ ఉన్న పిల్లలను గుర్తించి వారికి అవసరమైన అదనపు పౌష్టికాహారం అందజేయాలని ఆదేశించారు.ఈ తనిఖీలో పాఠశాల హెడ్ మాస్టర్, అంగన్వాడీ ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.


