- ట్రాన్స్‌ఫార్మర్ ధ్వంసం – కాపర్ వైర్ చోరీ.
- మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం రాంపురంలో ఘటన.
(నమస్తే న్యూస్, అక్టోబర్ 25, మరిపెడ)
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం రాంపురం గ్రామంలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ధ్వంసం చేసి కాపర్ వైర్లు దొంగిలించిన ఘటన పై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ బోర్లు, సాగునీటి అవసరాల కోసం ఏర్పాటు చేసిన ట్రాన్స్‌ఫార్మర్‌ను గుర్తుతెలియని వ్యక్తులు రాత్రి వేళ ఘోరంగా పగులగొట్టి, అందులోని కాపర్ కాయిల్, కేబుల్ వైర్లు ఎత్తుకెళ్లినట్లు సమాచారం.తెల్లవారుజామున పొలాలకు వెళ్లిన రైతులు ట్రాన్స్‌ఫార్మర్ పూర్తిగా ధ్వంసమైనట్లు గమనించారు. వెంటనే వారు విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించగా, అధికారులు సైట్‌ను పరిశీలించి, గ్రామస్థుల నుండి వివరాలు సేకరించారు.ఈ ఘటనతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ప్రస్తుతం సాగు సీజన్ ఉండడంతో మోటార్లకు విద్యుత్ లేకపోవడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది.గ్రామస్థులు మాట్లాడుతూ “ఇప్పుడున్న కాలంలో విద్యుత్ లేకుండా పంట సాగు సాధ్యం కాదు. వెంటనే కొత్త ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయాలి"అని డిమాండ్ చేశారు.ఈ సంఘటనపై పోలీసులకు అధికారిక ఫిర్యాదు చేసినట్లు సమాచారం.గుర్తుతెలియని దోపిడీదారుల కోసం పోలీసులు విచారణ చేపట్టారు.

