- అన్ని వర్గాల అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యం.
- నూతన గ్రామపంచాయతీ భవనాలను ప్రారంభించిన ఎమ్మెల్యే
- నూతన కార్యాలయాలు ప్రజలకు మరిన్ని సేవలు అందించాలి.
(నమస్తే న్యూస్, హైదరాబాద్, అక్టోబర్ 25)
గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, అన్ని వర్గాల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వం తోనే సాధ్యమని ఎమ్మెల్యే మదన్ మోహన్ అన్నారు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డి నియోజకవర్గం గాంధారి మండలంలోని హేమల నాయక్ తండా మరియు సర్వపూర్ గ్రామాల్లో కొత్తగా నిర్మించిన గ్రామ పంచాయతీ కార్యాలయ భవనాలను ఎమ్మెల్యే మదన్ మోహన్ ఘనంగా ప్రారంభించారు. ప్రతి గ్రామ పంచాయతీ భవనం నిర్మాణం రూ.20 లక్షల వ్యయంతో పూర్తయింది. మొత్తం రూ.40 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ భవనాలు ఆధునిక సదుపాయాలతో, గ్రామ ప్రజలకు మరింత సౌకర్యవంతమైన పరిపాలనా సేవలను అందించనున్నాయి.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ “ప్రతి గ్రామానికి సమగ్ర అభివృద్ధి అందించడమే మా లక్ష్యం. గ్రామ పంచాయతీ భవనాలు ప్రజలకు ప్రభుత్వ సేవలను చేరవేసే కేంద్రాలుగా మారాలి. ఈ కొత్త భవనాలు గ్రామాల అభివృద్ధికి, ప్రజా అవసరాలకు మరింత ఉపయోగపడతాయి” అని అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు,అధికారులు, మరియు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.




