ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి కి మంత్రి పదవి ఇవ్వాలి
తెలంగాణ కమ్యూనిటీ పారామెడికల్ వైద్యుల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు, దళిత చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు ఉక్కుల అశోక్
(నమస్తే న్యూస్ బ్యూరో, అక్టోబర్ 30, హైదారాబాద్)
ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి కి మంత్రి పదవి ఇవ్వాలని తెలంగాణ కమ్యూనిటీ పారామెడికల్ వైద్యుల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు, దళిత చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు ఉక్కుల అశోక్ డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఉక్కుల అశోక్ ప్రకటనలో మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి ఇచ్చి అభివృద్ధికి దోహదం చేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఏనుముల రేవంత్ రెడ్డి ని, అలాగే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ని కోరారు.
జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి అయినప్పటికీ, ఇప్పటి వరకు రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి లభించలేదు. ఇతర జిల్లాల్లో ఇద్దరు, ముగ్గురు మంత్రులు ఉన్న సందర్భంలో, తెలంగాణ రాష్ట్రానికి గుండె కాయలాంటీ రంగారెడ్డి జిల్లాకు ఒక మంత్రి కూడా లేకపోవడం జిల్లా ప్రజల్లో తీవ్ర నిరుత్సాహానికి దారితీస్తోంది.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్నా, రంగారెడ్డి జిల్లా అభివృద్ధి స్థబ్దంగా ఉందని, పార్టీ కార్యకర్తలు మరియు ప్రజలందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారని అన్నారు.మల్ రెడ్డి రంగారెడ్డి కి మంత్రి పదవి ఇవ్వడం ద్వారా జిల్లా అభివృద్ధికి ఊతం లభిస్తుందని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బలమైన అండగా నిలుస్తారని ఆయన అన్నారు. జిల్లా ప్రజల సమస్యలు పరిష్కరించుకోవడానికి మంత్రి పదవి అవసరమని, జిల్లా కార్యకర్తలందరూ కూడా ఇదే డిమాండ్ చేస్తున్నారని పేర్కొన్నారు.
రంగారెడ్డి జిల్లా నుండి గెలిచిన ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యే
“అజరుద్దీన్ గారికి మంత్రి పదవి ఇస్తున్నారు కదా! ఆయన ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓడిపోయినా ఇప్పుడు ఎమ్మెల్సీగా నియమించారు. ఇంకా ప్రమాణ స్వీకారం చేయకముందే మంత్రి పదవి ఇవ్వబడింది. మరి రంగారెడ్డి జిల్లా నుండి గెలిచిన ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యే అయిన మాల్ రెడ్డి రంగారెడ్డి గారికి ఎందుకు ఇవ్వడం లేదు?” అని ఉక్కుల అశోక్ ప్రశ్నించారు.
మల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోతే ఆందోళనలు ఉదృతం చేస్తాం.
మల్ రెడ్డి రంగారెడ్డి కి మంత్రి పదవి ఇవ్వకుంటే ఆమరణ దీక్షకు సిద్ధమవుతానని ఉక్కుల అశోక్ హెచ్చరించారు.జిల్లా అభివృద్ధి, కార్యకర్తల ఉత్సాహం మరియు కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు దృష్ట్యా, వెంటనే రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాలని ఆయన ముఖ్యమంత్రి మరియు టీపీసీసీ అధ్యక్షులను కోరారు.

