- దళారుల చేతిలో మోసపోవద్దు
- పత్తి కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి
- ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్
(నమస్తే న్యూస్, దంతాలపల్లి, అక్టోబర్ 26)
రైతులు తాము పండించిన పత్తి పంటలను దళారుల చేతిలో అమ్ముకొని మోసపోవద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని, ఈ కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకుని గిట్టుబాటు ధరను పొందాలని ప్రభుత్వ విప్,డోర్నకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రనాయక్ అన్నారు. ఆదివారం దంతాలపల్లి మండలకేంద్ర శివారు పడమటి గూడెం స్టేజి వద్ద శ్రీ బాలాజీ కాటన్ మిల్లులో సీసీఐ ద్వారా ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు సీసీఐ ద్వారా ఏర్పాటు చేసిన పత్తి మిల్లులో నిబంధనలకు లోబడి పత్తిని అమ్ముకొని క్వింటాకు రు.8110 గిట్టుబాటు ధరను పొందాలన్నారు. సీసీఐ అధికారులు సమన్వయంతో పనిచేసి రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు.కార్యక్రమంలో తొర్రూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్,మండల పార్టీ అధ్యక్షుడు బట్టు నాయక్,పిఏసిఎస్ చైర్మన్ సంపేట రాము,నాయకులు గురుపాల్ రెడ్డి,కొమ్మినేని సతీష్,నెమ్మది యాకయ్య,మిల్లు నిర్వాహకులు వంశీ తదితరులు పాల్గొన్నారు.




