- డీసీఎం ఢీకొని వృద్ధురాలు మృతి.
- గంటలోపు వాహనాన్ని గుర్తించిన పోలీసులు.
(నమస్తే న్యూస్, అక్టోబర్ 26, మరిపెడ)
ఖమ్మం వరంగల్ హైవే పై వాహనం ఢీకొని ఘోర ప్రమాదానికి గురై వృద్ధురాలు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం మరిపెడ హైవే శివారు ప్రాంతంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మరిపెడ గ్రామానికి చెందిన దేవరశెట్టి కౌసల్యమ్మ (వయస్సు 75) సుమారు ఉదయం 3:16 గంటల సమయంలో రోడ్డు దాటుతూ వెళ్తుండగా, ఒక గుర్తు తెలియని వాహనం ఢీకొని ఘటన స్థలం నుండి వెళ్లిపోయారు. ఈ ప్రమాదంలో కౌసల్యమ్మ అక్కడికక్కడే మృతి చెందారు.సమాచారం అందుకున్న వెంటనే మరిపెడ సీఐ మరియు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఆధారాలను విశ్లేషించిన పోలీసులు, గంటలోపే ప్రమాదం చేసి పరారైన వాహనాన్ని గుర్తించారు. ఆ వాహనం సదాశివ ట్రావెల్స్‌కు చెందిన ఐచర్ DCM (నెంబర్: TG 07 U 1252) గా నిర్ధారించారు.ఈ సంఘటనపై కేసు నమోదు చేసి, డ్రైవర్‌ను గుర్తించే దిశగా దర్యాప్తు కొనసాగుతోంది.ప్రమాద వాహనాన్ని తక్కువసమయంలో చేధించిన మరిపెడ పోలీసు బృందాన్ని అధికారులు అభినందించారు.

