- మత్స్యకారులకు మంచి రోజులు రాబోతున్నాయి:ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి.
- మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది.
- 100% రాయితీపై చేప పిల్లల పంపిణీ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.
- మైసమ్మ చెరువులో చేప పిల్లలను నీటిలోకి వదిలిన ఎమ్మెల్యే.
(నమస్తే న్యూస్, అక్టోబర్ 25, కోడూరు)
రాష్ట్రంలోని మత్స్యకారులకు మంచి రోజులు రాబోతున్నాయని, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 100 శాతం రాయితీ పైన మత్స్యకారులకు చేపలు పంపిణీ చేసే కార్యక్రమాన్ని కోడూరు మైసమ్మ చెరువు దగ్గర ఆయన ప్రారంభించారు . అంతకుముందు గంగాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మైసమ్మ చెరువు లో చేపలు వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని చెరువులలో పెంచే చేపలకు మంచి గిరాకీ ఉంటుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మంచి వర్షాలు పడినందున ప్రతి చెరువులో కూడా నీళ్ళు పుష్కలంగా ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో కంటే కూడా ఈ సంవత్సరం పెద్ద చేప పిల్లలు అందించిందన్నారు. ఈ సంవత్సరం మత్స్యకారులకు మంచి లాభాలు రావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షులు ఎన్ పి వెంకటేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, వైస్ చైర్మన్ పెద్ద విజయ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మారే పల్లి సురేందర్ రెడ్డి, బుద్దారం సుధాకర్ రెడ్డి, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, నాయకులు మైత్రి యాదయ్య, మల్లు అనిల్ కుమార్ రెడ్డి, గోవింద్ యాదవ్, తెలుగు గూడెం ఆంజనేయులు, జున్ను సురేందర్, అనిల్ కుమార్ ఈ.రవికుమార్, పి.నర్సింహులు , విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.