Type Here to Get Search Results !

ఉచిత సేవలు....ఉత్తవేనా...?

                        ఉచిత సేవలు....ఉత్తవేనా...?

    • పశు వైద్య సేవలు కరువై... రైతుల ఆవేదన
    • సంచార వాహనాల్లో మందుల కొరత...!
    • ప్రైవేటు షాపులకు ప్రభుత్వం మందుల మళ్లింపు పై ఆరోపణలు?



దంతాలపల్లి, అక్టోబర్ 18 (నమస్తే న్యూస్):

మూగజీవాల ప్రాణాలను రక్షించాలనే ప్రభుత్వ ఆశయం వృథా అవుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. “ఇంటి వద్దకే వైద్యం” అన్న నినాదంతో ప్రారంభించిన సంచార పశు వైద్యశాలలు ఇప్పుడు కేవలం పేరుకే మిగిలిపోయాయని రైతులు మండిపడుతున్నారు.ఆపదలో పశువులకు వైద్యం దొరకడం లేదు.2016లో ప్రభుత్వం ప్రత్యేకంగా 1962 టోల్ ఫ్రీ నెంబర్‌ను ప్రారంభించి, అత్యవసర వైద్య సేవల నిమిత్తం మొబైల్ పశు వైద్య వాహనాలను ప్రవేశపెట్టింది. ఒక్క ఫోన్ కాల్‌కు స్పందించి వైద్య బృందం తక్షణంగా వచ్చి చికిత్స అందించాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ వ్యవస్థ పూర్తిగా స్తబ్ధుగా మారిందని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.“1962 నెంబరుకు కాల్ చేస్తే ‘మేము దూరంలో ఉన్నాం, మందులు లేవు’ అనే సమాధానమే వస్తుంది. మందులు దొరకదని, మీరు పట్టణానికి వెళ్లి కొనుక్కొని రమ్మని చెబుతున్నారు,” అంటూ రైతులు వాపోతున్నారు.

నరేందర్ రైతు- దంతాలపల్లి 

“మా పెంపుడు కుక్క రోడ్డు ప్రమాదంలో గాయపడింది. 1962కు కాల్ చేశాం. మూడు గంటలు వేచిచూసాం, కానీ వాహనం రాలేదు. చివరికి జంతువు చనిపోయింది,” అని రైతు నరేందర్ కన్నీళ్లతో వివరించారు. ఆయన మాటల్లోనే, “రెండేళ్ల క్రితమూ ఇదే పరిస్థితి. కాల్ చేసినా ఎవరూ రాకుండా పోయారు. సంచార వైద్య వాహనం అనే పేరు మాత్రమే మిగిలింది.

మందుల కొరతపై పలు ఆరోపణలు.

మండలంలో ఉన్న రెండు పశు వైద్యశాలల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం పంపే ఉచిత మందులు రైతుల దరి చేరకపోవడమే కాకుండా, అవి ప్రైవేటు మందుల షాపులకు చేరుతున్నాయంటూ ప్రజలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. “రైతు డబ్బుకు కనీసంగా విలువ ఇవ్వట్లేదని” స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మూగ జీవాల రోదనపై అధికారుల మౌనం.

రైతుల ఆరోపణలపై జిల్లా అధికారులు ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ప్రజలు చెబుతున్నారు. “మూగజీవాల వైద్యానికి కేటాయించిన నిధులు ఎక్కడికి పోతున్నాయో విచారణ జరపాలి,” అంటూ స్థానిక పశు ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు.వీటిపై జిల్లానిర్వహణాధికారి దృష్టి సారించాలని గ్రామస్థులు కోరుతున్నారు.




Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.