- డిసిసి అధ్యక్షుడి ఎంపికపై నేతల అభిప్రాయ సేకరణ
- మహబూబ్‌నగర్ కాంగ్రెస్ కార్యాలయంలో ఉత్సాహంగా సమావేశం.
(నమస్తే న్యూస్ ,అక్టోబర్ 18,మహబూబ్‌నగర్)
డిసిసి అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియలో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో నిన్న జరిగిన సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేశారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.ఎమ్మెల్యే మాట్లాడుతూ... “పార్టీ ఉంటేనే మనం ఉంటాం. ప్రజాస్వామ్య బద్ధంగా ఎవరి ఉద్దేశాలు వాళ్లు చెప్పవచ్చు. పార్టీ బలోపేతం అందరి బాధ్యత” అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ సూచనల మేరకు డిసిసి అధ్యక్షుల ఎంపిక కోసం సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమం దేశవ్యాప్తంగా కొనసాగుతోందని తెలిపారు.డిసిసి అధ్యక్షుని ఎంపికలో భాగంగా జిల్లా నాయకుల అభిప్రాయాలను సేకరించడానికి ఏఐసిసి పరిశీలకులు జిల్లాకు వచ్చారని ఆయన వివరించారు. ఈ నెల 21వ తేదీన ప్రతి జిల్లా నుంచి ఆరుగురు ప్రతినిధుల పేర్లను ఎఐసిసి కి పంపనున్నట్లు ప్రకటించారు.తదుపరి ఎంఎల్సీ ఎం. నారాయణ స్వామి గారు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి గారిని కూడా ఫోన్ ద్వారా సంప్రదించి అభిప్రాయాలను తీసుకున్నామని తెలిపారు. రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ వాకిటి శ్రీహరి స్వయంగా హాజరై తన అభిప్రాయాన్ని తెలిపారని చెప్పారు. పార్టీలో ఎలాంటి అపోహలు లేకుండా ప్రతి ఒక్కరూ తన ఉద్దేశాన్ని పరిశీలకులకు నిస్సంకోచంగా చెప్పాలని ఆయన సూచించారు.ఈ సమావేశంలో పీసీసీ అబ్జర్వర్ ఉజ్మా షాకీర్, మెట్ట సాయి కుమార్, మేయర్ ఓబేదుల్లా కొత్వాల్, దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి, టి.పిసిసి ప్రధాన కార్యదర్శి సంజీవ్ ముదిరాజ్, హర్షవర్ధన్ రెడ్డి, జహీర్ అక్తర్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, జిల్లా మహిళా అధ్యక్షురాలు వసంత, డిసిసి ఉపాధ్యక్షుడు చంద్రకుమార్ గౌడ్, వినోద్ కుమార్, సురేందర్ రెడ్డి, ఆనంద్ గౌడ్, రాధా అమర్, మహేందర్, ఫయాజ్, అజ్మత్ అలీ, అవేజ్, సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
