- ప్రాణాలు పోతేనే పట్టించుకుంటారా..!
- మహబూబాబాద్‌లో ప్రమాదకరంగా మారిన గుంతలు.
- నిత్యం జరుగుతున్న ప్రమాదాలు.
(నమస్తే న్యూస్, అక్టోబర్ 25, మహబూబాబాద్)
మహబూబాబాద్ టౌన్ కేంద్రంలో ఇల్లందు బైపాస్ రోడ్డులోని ధరణి హాస్పిటల్ సమీపంలో రహదారిపై ఏర్పడిన ప్రమాదకర గుంతలు స్థానికులకు, ప్రయాణికులకు తీవ్ర ఇబ్బంది గా మారాయి.పలుమార్లు వర్షాలతో రహదారి దెబ్బతినడంతో లోతైన గుంతలు ఏర్పడ్డాయి. ఈ గుంతలను ఇప్పటికీ మరమ్మతు చేయకపోవడంతో, ప్రతిరోజూ ద్విచక్ర వాహన దారులు, ఆటోలు, చిన్న వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.రహదారి గుంతలు కారణంగా ఇప్పటికే ఒకరిద్దరు గాయపడిన సంఘటనలు చోటు చేసుకున్నప్పటికీ, సంబంధిత రోడ్డు & మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోకపోవడం పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.స్థానిక వాసులు మాట్లాడుతూ “ఈ రహదారి మహబూబాబాద్ నుంచి ఇల్లందు, దోర్నకల్, యాదాద్రి వైపు వెళ్లే ముఖ్య మార్గం.వాహనాలు స్వల్ప తప్పిదానికి కూడా జారిపడే ప్రమాదం ఉంది.వెంటనే మరమ్మతు చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలి.”అని డిమాండ్ చేశారు.ప్రజల ఆందోళనను గమనించి, అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

