●ఒక్కో సంక్షేమ పథకానికి ఒక్కో రేటు వసూలు చేస్తున్నారు.
●కాంగ్రెస్ పార్టీ పై నమ్మకంతోనే పార్టీలో చేరాం.
●గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం:తోట సురేష్
(నమస్తే మానుకోట-నర్సింహులపేట)
విద్యార్థుల ఆత్మ బలిదానాలపై ఏర్పడిన తెలంగాణాను, ఆత్మహత్యల తెలంగాణాగా, నిరుద్యోగ తెలంగాణాగా, తాగుబోతుల తెలంగాణాగా,అఘాయిత్యాల తెలంగాణాగా , అప్పుల తెలంగాణగా మార్చిన కేసీఆర్ కుటుంబాన్ని ,ప్రజలను దోచుకుతింటున్న రెడ్యానాయక్ ను ఈ ఎన్నికల్లో ఓడించేందుకు ప్రతి ఒక్కరు చేతిగుర్తుకు ఓటు వేయాలని డోర్నకల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జాటోత్ రామచంద్రునాయక్ పిలుపునిచ్చారు . ఈ సందర్భంగా శుక్రవారం నర్సింహులపేట మండలంలోని ముంగిమడుగు ,బంజర,గోల్ బోడ్కాతండా,కొమ్ములవంచ ,జయపురం తదితర గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు.బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దాసరోజు రాజశేఖర్ ఆధ్వర్యంలో కొమ్ములవంచ గ్రామంలో కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ రైతు సమన్వయ సమితి జిల్లా కమిటీ సభ్యులు, జాతీయ క్రీడాకారుడు తోట సురేష్ సుమారు 200 మంది కార్యకర్తలతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి డాక్టర్ రామచంద్రునాయక్ సాదరంగా ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో తోట సురేష్ మాట్లాడుతూ నేడు అధికార పార్టీలో ప్రతి సంక్షేమ పథకానికి ఒక్కో రేటు చొప్పున వసూలు చేస్తున్నారని ,అర్హులకు పథకాలు అందడం లేదని ,కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాంచంద్రునాయక్ పై పూర్తి విశ్వాసంతో బడుగు,బలహీన వర్గాలకు న్యాయం చేకూరుతుందని పార్టీలో స్వచ్ఛందంగా చేరామని అన్నారు. అనంతరం రామచంద్రునాయక్ మాట్లాడుతూ దళిత ,గిరిజన, బడుగు,బలహీన వర్గాలకు న్యాయం చేకూరాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని అన్నారు.తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియమ్మ ను మోసం చేశారని ,ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఆరు గ్యారెంటీలను అమలు చేయబోతున్నామని ,ఈ ఎన్నికలలో చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని నమ్ముకున్న కార్యకర్తలకు అండగా ఉంటామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరచాలని అన్నారు.తోట సురేష్ చేరిక కాంగ్రెస్ పార్టీకి కొత్త జోష్ ను నింపిందని,రాబోయే రోజుల్లో పార్టీ సురేష్ సేవలు వినియోగించుకుంటుందని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఇర్రి లింగారెడ్డి,జిల్లా మహిళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మాలతి రెడ్డి ,మండల పార్టీ అధ్యక్షుడు జినుకుల రమేష్,సీనియర్ నాయకులు ,పెద్దనాగారం స్టేజి సర్పంచ్ బొబ్బసోమిరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దాసరోజు రాజశేఖర్, నర్సింహులపేట మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు చిర్ర సతీష్ గౌడ్, మహిపాల్ రెడ్డి ,చిర్ర ఉపేందర్ ,గ్రామ పార్టీ అధ్యక్షుడు మైదం మల్లయ్య ,ఉప సర్పంచ్ రాంపెల్లి లక్ష్మీ నారాయణ ,పిఎసిఎస్ డైరెక్టర్ డొనికెని లక్షమయ్య ,గుద్దేటి శంకర్ ,వార్డు మెంబర్ ఓర్సు నాగయ్య మరియు జాటోత్ గోపి ,హచ్యు ,వాగ్యా ,డోనికెన కృష్ణ ,రామన్న ,శివరాత్రి వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు.




