◆అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు.
◆కేటీఆర్ పర్యటన సందర్భంగా కెవిపిఎస్ నాయకుల ముందస్తు అరెస్టులు.
ప్రశ్నించే గొంతులపై నిర్బంధాన్ని కొనసాగిస్తున్న రాష్ట్ర ప్రభుత్వనిరంకుశత్వానికి ప్రజలు చరమగీతాన్ని పాడాలని కేవిపిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి మందుల యాకుబ్ ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.సోమవారం తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ తొర్రూర్ పర్యటన నేపథ్యంలో నర్సింహులపేట మండల కేంద్రంలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కెవిపిఎస్ నాయకుల ముందస్తు అరెస్టులు ప్రభుత్వ పిరికిపంద చర్యగా భావిస్తూ ఇట్టి అక్రమ అరెస్టులను కెవిపిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి మందుల యాకూబ్ తీవ్రంగా ఖండించారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళితుల పట్ల సవతి తల్లి ప్రేమ చూపెడుతూ దళితులకు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా ప్రశ్నించే ప్రజా సంఘ గొంతుకులపై నిర్బంధాన్ని పెంచుతున్నాయన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు దళితులకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే దళితుల సంక్షేమం కోసం ప్రజాసంఘాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ప్రశ్నించే హక్కు ఉందని మండిపడ్డారు ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షలు ఇస్తానన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం యూనిట్లు తగ్గించి దళితుల మధ్య చిచ్చు పెట్టిందన్నారు.

