పేదల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని,వారిని అన్ని రకాలుగా ఆదుకుంటామని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ అన్నారు.ఈ సందర్భంగా మహబూబాబాద్ పట్టణ పరిధిలోని 26వ వార్డు లోని మంద కొమురమ్మ నగర్ ,సోనియా నగర్ కు చెందిన పలువురి నిరుపేదల ఇండ్ల స్థలాలకు జి.ఓ నెం.58 అనుసరించి ప్రభుత్వం నుండి మంజూరు అయిన ఇండ్లపట్టాలను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డా.పాల్వాయి రాంమోహన్ రెడ్ది,వైస్ చైర్మన్ ఎండి ఫరీద్,మార్నేని వెంకన్న, గద్దె రవి, స్థానిక కౌన్సిలర్ డౌలాగర్ స్వాతి శంకర్, గుగ్గిళ్ల పిరయ్య, వీరేందర్ తదితరులు పాల్గొన్నారు.


