ఉస్మానియా యూనివర్సిటీ జెఎసి నాయకుడు డా.లునావత్ నెహ్రూ నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు.
పోరాటాల తెలంగాణలో చరిత్ర గొప్ప అవకాశమిచ్చింది. విద్యార్ధి ప్రజా ఉద్యమాలలో ఈ మట్టి బిడ్డగా మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం రామన్నగూడెం గ్రామ శివారులోని మారుమూల తండా అయిన గోల్ బొడ్కా తండాకు చెందిన లునావత్ హరిసింగ్ ,కమిలీ దంపతులకు 1981 ఎప్రిల్ 20న జన్మించిన లునావత్ నెహ్రూనాయక్ దంతాలపల్లి ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక విధ్యనభ్యసించి, ఉన్నత విధ్యకై హైదరాబాద్ లోని నిజాం కళాశాలలో చేరాడు..విద్యతో పాటుగా ఎప్పుడు నిరుపేదల సమస్యలు ,రైతుల కష్టాలు చూసి మౌన వేదనకు గురౌతుండేవాడు.ఈ క్రమంలోనే సాటి విద్యార్థులు ఉద్యోగాలు లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న తరుణంలో నూనూగు మీసాల ప్రాయంలోనే సమాజంపై తన ప్రశ్నలను ఎక్కుపెట్టి పరిష్కారానికై పరితపించే వాడు.డిగ్రీ పూర్తికాగానే ఉన్నత విద్యకై ఉస్మానియా విశ్వవిద్యాలయం లో అడుగుపెట్టిన నెహ్రూనాయక్ 2006 న ఉవ్వెత్తున ఎగిసిన తెలంగాణ ఉద్యమంలో నిప్పు కణికై ముందుకు సాగాడు. మారుమూల గిరిజన తండాలో పుట్టి చారిత్రక కర్తవ్య నిర్వాహణలో బాగమయ్యాడు.యూనివర్శిటీలో తోటి విద్యార్థులతో కలిసి గిరిజన సామాజిక విద్యార్థుల్లో చైతన్యం తీసుకుని వచ్చే క్రమంలో తలపెట్టిన గిరిజన విద్యార్థి ఘర్జన ను ముందుడి నడిపించాడు. ఈ క్రమంలోనే
విద్యార్థి ఉద్యమంలో... ప్రజాస్వామిక ఉద్యామాల్లో బాగమయ్యాడు. అనేక నిర్బంధాలు 125 అక్రమ కేసులు, జైళ్లు, నిర్భంధాలెన్ని ఎదురైనా తెలంగాణ రాష్ట్ర సాధనలో వెన్నుచుపలెదు. తెలంగాణ ఉద్యమంలో పదివేల కిలోమీటర్ల పాదయాత్ర, బస్సు యాత్ర,సైకిల్ యాత్రతో పాటు సకలజనుల సమ్మెలో చురుగ్గా పాల్గొన్నారు. పార్లమెంటు సాక్షిగా ఢిల్లీలో జరిగిన తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ఎందరో అమరుల త్యాగాలు..బలిదానాలు... విద్యార్థి ప్రజా పోరాటాలలో బిడ్డగా... తో బుట్టుగా.. తమ్ముడిగా..సహచరుడిగా...ఆదరించి , వారి అండడదండలతొ దైర్యాన్ని పొందుతూ ముందుకు నడిచాడు.ఈ నేపథ్యంలో వెన్నుదన్నుగా నిలిచిన తెలంగాణ తల్లులు.. సబ్బండా వర్గాలు... సమాజం ... విద్యార్ధి యువత, ప్రజలు , మీడియా మిత్రుల శ్రేయోభిలాషుల ఆశీస్సులు ,కొండంత అండగా ఉద్యమంలో పాల్గొన్నానని అన్నారు.అలనాటి ఉద్యమ కాలంలో విధ్యార్థులకు సన్నిహితంగా ఉన్న ఈటెల రాజెందర్ తో కలిసి ఎన్ళో పోరాటాలలో పాల్గొన్నారు. అలనాటి నుండి ఈనాటి వరకు ఈటెల సహచరునిగా ప్రఖ్యాతను సంపాదించుకున్నారు.
అలనాడు సీమాంధ్ర పెత్తందారీ నాయకులైన తెలంగాణ వ్యతిరేకులు జగన్ ను అడ్డుకునే క్రమంలో జరిగిన మానుకోట రాళ్ళఘటనలో ప్రత్యేక్షంగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాదాపుగా 60 సంవత్సరాలుగా అనేక పోరాటాలు, త్యాగాలు, ఆందోళనలు చేసి తెలంగాణ రాష్ట్రంసాధించుకున్నామని ఇక అన్ని రకాల పీడలు వదిలించుకున్నామని ప్రజలు ఎంతో సంతోషించినారు. కలలుగన్నారు. కానీ అనతి కాలములోనే ఆ సంతోషం భగ్నమవడమూ ప్రారంభమైంది. నూతన రాష్ట్రంలో సామాజిక న్యాయం, స్వపరిపాలన, బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవం, పారదర్శక పాలన, అవినీతి రహిత పాలన, పేద ప్రజల రాజ్యాంగ హక్కుల పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ మొదలగు ప్రాధమిక అంశాలు పగటి కలలుగానే మిగిలిపోయాయి అని తెలంగాణ ప్రజలు, ఉద్యమకారులు, మేధావులు ఆవేదనకు గురి కావడం గమనిస్తూ ఉన్నాం. అన్న వస్త్రం అడగబోతే ఉన్న వస్త్రం కూడా లాక్కున్నట్లు జరుగుతున్నదని ప్రజల ఆవేదన. విద్య, వైద్య రంగాల అభివృద్ధి, ఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పన, చిన్న సన్న కారు మరియు రైతు కూలీ, కౌలు రైతుల సమస్యలు గత ఎనిమిది సంవత్సరాలుగా మరింత జటిలమవుతున్నాయి. ఏరులై పారుతున్న మద్యం, ఈ సారా వ్యాప్తి వలన సంభవిస్తున్న అకాల మరణాలు, కుటుంబ సంక్షోభాలు హృదయ విధారకమని అన్నారు.
తెలంగాణ రాష్ట్రం సిద్ధించి పదిసంవత్సరాలు గడుస్తూ వచ్చింది. గత 9 సంవత్సరాలలో రాజకీయ, ఆర్థిక, సామాజిక, ఉపాధి, రంగాల అభివృద్ధి, ప్రజాస్వామ్య వ్యవస్థల తీరు తెన్నులు, ప్రభుత్వ పారదర్శకత, విధాన, పరిపాలన విశ్లేషణ గురించి తెలంగాణ కోసం తపించిన మన ప్రజల కోసం క్రీయాశీల రాజకీయాల్లో బాగం అవ్వడము అవసరమని ఎందరో ప్రజాస్వామికవాదుల.. మీత్రుల...ప్రజల అభిష్టంమేరకు నా జీవితంలో మరో ప్రయాణంకు తొలి అడుగు వేస్తున్నానని పోరాడి సాధించిన స్వరాష్ట్రంలో ఏ ప్రజాస్వామిక ఆకాంక్షల కోసం తెలంగాణ ఉద్యమంలో ఉద్యమాలు చేసామో ఆ ఆకాంక్షలను నెరవేర్చమని తెలంగాణ విద్యార్థి ఉద్యమకారులుగా త్యాగాల పునాదుల మీద అందలమెక్కిన కేసీఆర్ కుటంబం పాలన మొదలై.. దొరల గడీల పాలన వచ్చి... అవినీతి, అప్పుల కుప్పగా మారిన తెలంగాణ వ్యవస్థను అందరం గమనిస్తున్నాం. మనవనరులు - నిధులు, నీళ్లు, భూమి ఇసుక, ఇతర గనులు, ప్రాంతేతరుల దోపిడి చేసే విధానాలకు అడ్డుకట్ట కూడా పడుతుందని గంపెడు ఆశలతో ఎదురు చూసిన ప్రజల ఆశలకు అడియాశలే మిగిలాయి. వ్యక్తులు మారిండ్రు గాని వ్యవస్థలు మారలేదు. రాష్ట్రంలోలక్షలాది కుటుంబాలు ఆర్థిక సంక్షోభంలో పడి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు.అమరవీరుల ఆశయాలు ఎండమావులు అవుతున్న వేళ అన్నదాతల జీవితాల్లో ఆనందం కోసం, యువతకు, నిరుద్యోగులకు న్యాయం కోసం, దళిత, బహుజనుల, సబ్బండ వర్గాల సాధికారత కోసం, మైనార్టీల బతుకు బాగుకోసం, ఆదివాసీ గిరిజనుల జీవితాల్లో వెలుగుల కోసం, మహిళలకు సమాన వాటా కోసం నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు వుద్యమ స్పూర్తితో బాగమవుతానని, తెలంగాణలో కేసీఆర్ నిరంకుశ పాలనను బొంద పెట్టడం బిజెపి తోటే సాధ్యమని, డోర్నకల్ నియోజకవర్గంలోని సబ్బండ వర్గాల అభివృద్ధికి వారి సమస్యల పరిష్కారానికి రాజకీయ ప్రయాణం ఆసన్నమైందని,ఈ ప్రయాణం లో చేయ్యందిస్తారని డోర్నకల్ ప్రజలను వేడుకున్నారు.
