ధర్మం తప్పిన దేవాదాయ శాఖ.
ఏసీబీ నిందితుని పక్కన కూర్చోబెట్టుకుని వేలం నిర్వహణ?
ఈఓ ను నిలదీసిన స్థానికులు..!
డోర్నకల్ /మరిపెడ(జులై 02)నమస్తే న్యూస్.సుప్రసిద్ధ మాకుల శ్రీ వెంకటేశ్వర ఆలయంలో గురువారం జరిగిన ఆలయం వేలం పాట గందరగోళంగా మారింది.గుంజేడు ఆలయంలో రూపాయలు 20,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిన అప్పటి ఈవో కేసు బిక్షమాచారిని పక్కనే కూర్చోబెట్టుకొని వేలంపాట నిర్వహించటం పట్ల మరిపెడ గ్రామస్తులు దేవాదాయ శాఖ అధికారులపై మండిపడ్డారు.గ్రామ పెద్దలు కుడితి వెంకటరెడ్డి,వేర్మరెడ్డి వెంకటరెడ్డి,బుడుగుల రాజు,రేఖ రమేష్ లు ఈ సందర్భంగా మాట్లాడుతూ అవినీతి నిరోధక శాఖకు పట్టుబడిన నిందితున్ని ఎలా పక్కనే కూర్చోపెట్టుకొని వేలం నిర్వహిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఏసీబీ నిందితుడైన బిక్షమాచారి మరిపెడ మాకుల వెంకటేశ్వర ఆలయంలో విధులు నిర్వహిస్తున్న సమయంలో అక్రమంగా ఇంటి నిర్మాణం చేశారని వారు ఆరోపించారు.ఇదే ఇంటిపై రైతుబంధు పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారని వారు తెలిపారు.ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి ప్రభుత్వ అధికారులను తప్పుదోవ పట్టిస్తూ అక్రమ నిర్మాణం రైతు బంధు పథకం లబ్ధి పొందటం తదితర నేరాలకు పాల్పడిన అతనిపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరారు.దీంతోపాటు ఆలయంలో రోజువారి కార్యక్రమాల్లో అతను తలదూరుచుతూ అర్చకుల మధ్య వివాదం నెలకొల్పుతున్నట్లు వారు ఆరోపించారు.ధర్మంగా పనిచేయాల్సిన దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తుందని వారు అన్నారు.ధర్మం తప్పి అక్రమంగా చేపట్టిన ఇంటి నిర్మాణాన్ని కూల్చివేయాలని స్థానికులు ఆరోపించారు.ఆలయ క్షేత్రంలోని పరిసరాలు ప్రాంతాలలో ఇంటి నిర్మాణం చేపట్టడం,దాంతోపాటు ఆ ఇంటిని కిరాయికి ఇస్తూ అదనపు ఆదాయం పొందడం జరుగుతుందన్నారు.కావున తక్షణమే ఆ ఇంటిని కూల్చివేయాలని కోరారు.

