మాకుల ఆలయంలో టెండర్ల వేలం నిర్వహణ.
డోర్నకల్ /మరిపెడ(జులై 02)నమస్తే న్యూస్.
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని మాకుల వెంకటేశ్వర స్వామి,భావో సంగ్ బావు ఆలయ క్షేత్రంలో ఆలయ ఈఓ ఆధ్వర్యంలో వివిధ షాపులకు టెండర్లను నిర్వహించారు.కిరణం మరియు కూల్ డ్రింక్,టెంట్ హౌస్ షాపును రెండు లక్షల 70 వేలకు రవికాంత్ దక్కించుకున్నారు.అలాగే కొబ్బరికాయల టెండర్ ను లక్ష 11 వేలకు వీరన్న,స్వీట్ షాప్ ను 91 వేలకు నాగరాజు వేలంపాటలో దక్కించుకున్నారు.టెండర్ పొందినట్టుగా పత్రాలను ఈవో టెండర్ దారులకు అందజేశారు.వేలంలో వచ్చిన రూపాయలను ఆలయ అభివృద్ధి కోసం ఖర్చు పెడతామని తెలియజేశారు.ఈ వేలం కార్యక్రమంలో ఆలయ అధికారులు శేఖర్,ఆలయ ఇబ్బందులు,అర్చకులు,టెండర్ దారులు భిక్షం ఇంకా తదితరులు పాల్గొన్నారు.

