- భవన నిర్మాణ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి.
- సిఐటియు మండల కన్వీనర్ వషపొంగు వీరన్న.
![]() |
| తహసిల్దార్ కు వినతి పత్రం అందజేస్తున్న సిఐటియు నాయకులు |
మండల రిపోర్టర్: జి వెంకన్న.
తిరుమలాయపాలెం,జూన్30(నమస్తేన్యూస్)
భవన నిర్మాణ కార్మికుల న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిఐటియు మండల కన్వీనర్ వషపొంగు వీరన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తిరుమలాయపాలెం మండల ఎమ్మార్వో కి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు మండల కన్వీనర్ వసపొంగు వీరన్న మాట్లాడుతూ భవన నిర్మాణ సంక్షేమ బోర్డు, స్కీములను, ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వద్దని, వెల్ పేరు బోర్డు నుండే సంక్షేమ పథకాలు కార్మికులకు అందించాలని సిఎస్సి సంస్థ హెల్త్ టెస్టులను వెంటనే రద్దు చేయాలని సహజ మరణానికి 5 లక్షల రూపాయలకు పెంచాలని, పెండింగ్లో ఉన్న క్లెయిమ్స్ అన్ని వెంటనే విడుదల చేయాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మరియు 55 సంవత్సరాలు దాటిన భవన నిర్మాణ కార్మికుడు నిరాధారణకు గురై జీవనోపాధి భారంగా మారే ప్రమాదం ఉంది. అందుకని తక్షణమే ఈ క్లిష్టమైన పరిస్థితిని అర్థం చేసుకొని నెలకు పెన్షన్ రూపంలో 6000 ప్రతినెల చెల్లించాలని 2009 నుండి రెన్యువల్ కానీ 13 లక్షలకు పైగా ఉన్న లేబర్ కార్డులను యుద్ధ ప్రాతిపదికన వెంటనే రెన్యువల్ చేయాలని ఎన్నో ఏళ్లుగా ప్రజలందరికీ ఇండ్లునిర్మించే ఈ పేద కార్మికులకు నిలువ నీడ లేదని వీరందరికీ ప్రభుత్వము ప్రత్యేకంగా భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం అందించే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని, గత ప్రభుత్వము అసెంబ్లీలో ఇచ్చిన హామీ ప్రకారము భవన నిర్మాణ కార్మికులకు సౌకర్యార్థము మోటార్ సైకిల్ ఇవ్వాలని, అర్హత కలిగిన భవన నిర్మాణ కార్మికులకు 15 రోజుల్లో కొత్త కార్డులు మంజూరు చేసి సెస్సు ద్వారా వచ్చే డబ్బులను వారికే ఖర్చు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో భవన నిర్మాణ కార్మికులందరినీ ఐక్యపరిచి పైన పేర్కొన్న సమస్యలు పరిష్కారమా అయ్యేంతవరకు పోరాడుతామని ఈ న్యాయమైన సమస్యల పట్ల ప్రభుత్వము సానుకూలంగా స్పందించి వెంటనే అమలుపరచాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక అధ్యక్ష కార్యదర్శులు కోడి లింగయ్య, గట్టిగుండ్ల మనసుూరు, పట్ల అంజయ్య, గట్టిగుండ్లఉపేందర్, పెళ్లిమల్లి కృష్ణ, ఎల్లి మల్ల శ్రీను, ఎస్.కె రంజాన్, ఎస్కే హుస్సేన్, ఎస్ కే నవీషా, ఎస్ కే సైదులు, వాంకుడోత్ రంజిత్, గట్టిగుండ్ల చినమలసూరు, అక్బర్, సిఐటియు నాయకులు, ప్రజలు, తదితరులు పాల్గొని ఎమ్మార్వో కు వినతిపత్రం అందజేశారు.

