Type Here to Get Search Results !

వార్డు సభ్యులు ప్రజలకు,పంచాయతీకి మధ్య వారధిగా పనిచేయాలి-ఎంపీడీఓ వేణుగోపాల్ రెడ్డి.

పురుషోత్తమాయగూడెంలో వార్డు సభ్యులకు ఓరియంటేషన్ శిక్షణ పూర్తి.
సర్టిఫికెట్లు అందజేసిన ఎంపీడీఓ వేణుగోపాల్ రెడ్డి.



డోర్నకల్/మరిపెడ,జూన్ 27(నమస్తే న్యూస్).

మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని రైతు వేదికలో నూతనంగా ఎన్నికైన గ్రామపంచాయతీ వార్డు సభ్యులకు నిర్వహించిన నాలుగు రోజుల ఓరియంటేషన్ శిక్షణ కార్యక్రమం శనివారం ముగిసింది.చివరి రోజు కార్యక్రమానికి మరిపెడ ఎంపీడీఓ వేణుగోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ,గ్రామ స్వరాజ్య సాధనలో వార్డు సభ్యుల పాత్ర కీలకమని తెలిపారు.నూతన సభ్యులకు గ్రామాభివృద్ధి ప్రణాళికలు,పంచాయతీరాజ్ చట్టాలు,పరిపాలనా విధానాలు,15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగం,పారిశుద్ధ్య నిర్వహణ,హరితహారం,పల్లె ప్రగతి వంటి అంశాలపై అవగాహన కల్పించారు."గ్రామ సమస్యల పరిష్కారానికి వార్డు సభ్యులు ప్రజలకు,పంచాయతీకి మధ్య వారధిగా పనిచేయాలి అన్నారు.పారదర్శక పాలన అందించడమే లక్ష్యం కావాలి" అని సూచించారు.అనంతరం శిక్షణ పూర్తి చేసుకున్న వార్డు సభ్యులకు ఎంపీడీఓ వేణుగోపాల్ రెడ్డి స్థానిక సర్పంచ్ వెన్నెల నాగరాజు,పంచాయతీ కార్యదర్శులతో కలిసి సర్టిఫికెట్లు అందజేశారు.శిక్షణ పొందిన సభ్యులు గ్రామాభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేయాలని ఆకాంక్షించారు.ట్రైనర్లు రామోజీ,వెంకన్న,ప్రణయ్ వార్డు సభ్యుల విధులు,బాధ్యతలపై శిక్షణ ఇచ్చారు.కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు అరుణ్ జ్యోతి,రాజేంద్రప్రసాద్,హారిక,విప్లవ,పావని,రామకృష్ణ,ఆపరేటర్ ఉమా తదితరులు పాల్గొన్నారు.పురుషోత్తమాయగూడెం సహా పరిసర గ్రామాల వార్డు సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై శిక్షణను సద్వినియోగం చేసుకున్నారు.




Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.